రాష్ట్రాలకు యాంఫోటెరిసిన్- బి ఇంజెక్షన్‌లు కేటాయింపు

4272
coronavirus
- Advertisement -

ముకోర్మైకోసిస్(బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బి ఇంజెక్షన్ లు రాష్ట్రాలకు కేటాయింపులు చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో ముకోర్మైకోసిస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గత కేటాయింపులపై సమీక్ష నిర్వహించారు. దేశ వ్యాప్తంగా సుమారు 8,848 బాధితులు బ్లాక్ ఫంగస్ చికిత్స పొందుతున్నట్లు గుర్తించారు.

23,680 యాంఫోటెరిసిన్-బి వయల్స్ రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు అదనంగా కేటాయింపులు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో 350 రోగులకు గాను 890 యాంఫోటెరిసిన్-బి ఔషధాలు కేటాయించారు.

- Advertisement -