ఆరోగ్యానికి ఈ ఐదు ఎంతో మేలు..!

44
- Advertisement -

నేటి రోజుల్లో ఆరోగ్యాన్ని ఫదిలంగా ఉంచుకోవడం చాలమందికి సవాల్ గా మారింది. మారుతున్న జీవన విధానం, విపరీతమైన పని ఒత్తిడి, నిబద్దతలేని ఆహారపు అలవాట్ల కారణంగా మన ఆరోగ్యాన్ని మనమే దెబ్బ తీసుకుంటున్నాము. ఫలితంగా వయసుతో సంబంధం లేకుండా చాలా రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఇబ్బంది పడుతున్నాము. అయితే మనం తరచూ ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలకు మన ఇంట్లో దొరికే పదార్థాలతోనే చెక్ పెట్టవచ్చు. అవేంటో తెలుసుకుందాం !

ఉసిరి, నిమ్మకాయ
ఉసిరి, నిమ్మకాయ వంటివి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖ్యంగా ఈ సీజన్ లో వచ్చే వ్యాధులను ఎదుర్కోవడానికి రోగ నిరోధక శక్తి మెండుగా ఉండడం చాలా అవసరం. ఇందులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ వంటివి శరీరంలో మెటబాలిజాన్ని పెంచడంతో పాటు శరీరంలోని టాక్సీన్లను బయటకు పంపిస్తాయి.

సుగంధ ద్రవ్యాలు
మన వంటింట్లో యాలకలు, లవంగా, దాల్చిన చెక్క.. వంటి సుగంధ ద్రవ్యాలు కచ్చితంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యాన్ని ఫదిలంగా ఉంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే వితో తయారు చేసిన టీ గాని లేదా డీటాక్స్ డ్రింక్స్ గాని సేవించడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి వీటిని ప్రతిరోజూ మనం తాగే టీ లేదా పనియాలలో కలుపుకొని తాగితే.. శరీరంలోని వ్యర్థాలు బయటకు పొంపించడంతో పాటు రోజంతా ఉల్లాసంగా ఉండేలా చూస్తాయి.

తులసి
తులసితో ఉండే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. తులసిని చాలా వ్యాధులకు దివ్య ఔషధంలా ఉపయోగిస్తుంటారు ఆయుర్వేద నిపుణులు. దీనిని పచ్చిగా తీసుకున్నా లేదా ఎండబెట్టి పొడి రూపంలో తీసుకున్న ఎంతో ప్రయోజనకరం. శరీరంలో చక్కెర శాతాన్ని తగ్గించడంలో తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకా నోటి దుర్వాసనను పోగొట్టడం, జీవ క్రియను మెరుగుపరచడం వంటి పనులను కూడా చేస్తుంది.

తిప్పతీగ
తిప్పతీగను ఆయుర్వేదంలో విరివిగా ఉపయోగిస్తారు. దీనిని రసం చేసుకొని లేదా టీ రూపంలో తాగడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అంతే కాకుండా సీజనల్ గా వచ్చే వ్యాధులు అనగా దగ్గు జలుబు, ఫ్లూ వంటివాటిని తగ్గిస్తుంది.

అశ్వగంధ
అశ్వగంధను కూడా ఆయుర్వేదంలో ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధంలా ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడిని తగ్గించడం పాటు శరీరానికి కావలసిన శక్తిని బలాన్ని అందిస్తుంది. ఇంకా పురుషుల్లో ఎముకల పాటుత్వాన్ని పెంచడం, కండరాలను పుష్టిగా ఉంచడంలో అశ్వగంధ ఎంతగానో ఉపయోగ పడుతుంది.

కాబట్టి మనం సాధారణంగా ఎదుర్కొనే సమస్యలను సులువుగా ఎదుర్కొనేందుకు పైన వివరించిన అయిదింటి ఉపయోగం చాలా ఉంది.. కాబట్టి ఆరోగ్య సమస్యలను బట్టి వాటిని ఉపయోగించడం ఎంతో ఉత్తమం.

Also:అఫ్గాన్ టూర్ లో కెప్టెన్ ఎవరు ?

- Advertisement -