ఉసిరి కాయ తినడానికి ఎంతో వోగరుగా ఉన్నప్పటికి చాలా మంది ఇష్టంగా తింటూ ఉంటారు. ఉసిరికాయతో రుచికరమైన పచ్చళ్లు తయారు చేయడంతో పాటు మార్కెట్ లో కూడా అమ్ముతుంటారు. ఇక ఉసిరి ని కేవలం పచ్చళ్ళ లోనే కాకుండా వాటి రసాన్ని హెయిర్ అయిల్స్ లోనూ వివిధ రకాల షాంపులలోనూ వినియోగిస్తూ ఉంటారు. అలాగే ఉసిరి కాయను పచ్చిగా కూడా తినడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు చాలామంది. అయితే ఉసిరి కాయ తనడం వల్ల వాటిలో ఉండే లాభాల గురించి మాత్రం చాలా మందికి తెలియదు. ముఖ్యంగా ఉసిరి కాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ప్రతి 100 గ్రాముల ఉసిరికాయలో 600 గ్రాముల విటమిన్ సి ఉంటుంది.
Also Read:నిబంధనల ప్రకారమే శ్రీవాణి నిధులు..
విటమిన్ సి అనేది యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తూ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఎముకల అభివృద్దికి, రక్త నాళాల పని తీరును కూడా విటమిన్ సి మెరుగు పరుచుతుంది. అందువల్ల విటమిన్ సి అధికంగా లభించే ఉసిరి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇక జలుబు దగ్గు వంటి వాటిని నివారించే గుణాలు కూడా ఉసిరిలో ఉన్నాయి. ఒక గ్లాసు నీటిలో రెండు చెంచాల ఉసిరి రసాన్ని కలుపుకొని రోజు ఉదయాన్నే తాడడం ద్వారా కళ్ళు ఎర్రబడడం, దురద వంటి సమస్యలు తగ్గుతాయి.
Also Read:ఆ రెండు పార్టీలకు ఎన్డీయేనే దిక్కా?
అలాగే రక్త సరఫరా ను మెరుగు పరచడంలో కూడా ఉసిరి ఎంతగానో ఉపయోగపడుతుంది. అయితే ఉసిరి కాయవల్ల లాభాలు మాత్రమే కాకుండా నష్టాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉసిరి లో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. అందువల్ల ఈ విటమిన్ సి శాతం మన శరీరంలో పెరిగే కిడ్నీలో రాళ్ళు ఏర్పడే సమస్య ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే రక్తంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉన్నవారు కూడా ఉసిరి ని తినవద్దని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఉసిరి బ్లేడ్ లోని షుగర్ లెవెల్స్ ను మరింత గట్టిస్తుంది. అందువల్ల పలు ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇక కిడ్నీ వ్యాధులు ఉన్నవారు కూడా ఉసిరికి దూరంగా ఉండాలట ఎందుకంటే ఉసిరి మన శరీరంలోని సోడియం లెవెల్స్ ను పెంచుతుంది. అది మూత్రపిండాలపై చెడు ప్రభావం చూపే అవకాశం ఉంది. అందువల్ల ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు వైద్యుల సూచనల మేరకే ఉసిరి తినాలని చెబుతున్నారు నిపుణులు.