తన ఫేక్ వీడియోల వేనకుంది రాహుల్ గాంధీనే అని మండిపడ్డారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. అధికారం లేకపోవడంతో దాన్ని ఎలాగైనా సంపాదించుకోవాలని, నిరాశలో తన ఫేక్ వీడియో షేర్ చేస్తున్నారని ఆరోపించారు. అసోంలో మీడియాతో మాట్లాడిన షా…రాహుల్ తీరును తప్పుబట్టారు. ఫేక్ వీడియో, నిజమైన వీడియోలను చూపారు.
ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలపై కొందరు తన ఫేక్ వీడియోను షేర్ చేయడం పట్ల తీవ్రంగా మండిపడ్డ షా..ఫేక్ వీడియో ప్రచారాలు ఎప్పుడూ ఇంతలా జరగలేదని చెప్పారు. మ్యానిఫెస్టో ఆధారంగా రాహుల్ ఎన్నికల్లో పోటీ చేయాలని, ఫేక్ వీడియోలు సర్క్యులేట్ చేస్తూ కాదని దుయ్యబట్టారు.
కేంద్ర హోంశాఖ ఫిర్యాదు మేరకు ఇప్పటికే ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఐపీసీ, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు తొలగిస్తామంటూ అమిత్ షా మాట్లాడినట్లుగా సోషల్ మీడియాలో వీడియో ప్రచారం అవుతోంది.
Also Read:త్రివిక్రమ్ – బన్నీ..ద్విపాత్రాభినయం!