- Advertisement -
కరోనా కేసుల పెరుగుదల కారణంగా తలెత్తిన పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. వైద్య ప్రయోజనాల కోసం ఆక్సిజన్ సరఫరాను పెంచడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.యాక్టీవ్ కేసుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు ఆక్సిజన్ కేటాయింపును పునఃసమీక్షించాలని నిపుణుల బృందానికి నిర్దేశించింది హోంశాఖ.ఆక్సిజన్ రవాణా చేసే వాహనాలకు తగిన భద్రత కల్పించాలి.. రవాణా కోసం ప్రత్యేకమైన కారిడార్లు ఏర్పాటు చేయాలని అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది కేంద్ర హోంశాఖ.
- Advertisement -