జమ్మూ కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు నివాళులు అర్పించారు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా. అనంతరం బాధిత కుటుంబాలను ఆయన పరామర్శించి ఓదార్చారు. కాల్పుల ఘటన జరిగిన తీరుతెన్నుల వివరాలను అమిత్ షా వారిని అడిగి స్వయంగా తెలుసుకున్నారు.
జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మరణించిన వారి కుటుంబాలకు రూ. 10 లక్షల ఆర్థిక సహాయం, తీవ్రంగా గాయపడిన వారికి రూ. 2 లక్షల సహాయం, స్వల్పంగా గాయపడిన వారికి రూ.1 లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
Also Read:Pahalgam Attack:ఉగ్రవాదుల ఊహా చిత్రాలు
కశ్మీర్ ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని వెనక్కి వచ్చారు. అధికారులతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించి పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉగ్రవాదుల కోసం ఆర్మీ అధికారులు జల్లెడ పడుతున్నారు.

