- Advertisement -
తన ఆరోగ్య పరిస్ధితిపై ఎప్పటికప్పుడు అప్ డేట్ ఇస్తున్న బిగ్ బి అమితాబ్ తనను కంటికి రెప్పలా కాపాడుతున్న డాక్టర్లపై మరోసారి ప్రశంసలు గుప్పించారు. తమని కాపాడేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న డాక్టర్ల కోసం తండ్రి రాసిన పద్యంని అంకితమిచ్చాడు.
నేనెప్పుడు వారితోనే ఉంటాను. ఒంటరిగాను లేదా గుంపుగా వారి కోసం పనిచేస్తాను. హింసని ఎప్పటికి సహించను అనే పదాలతో అమితాబ్ తండ్రి హరివంశ రాయ్ రాసిన పద్యం అందరిని ఆకట్టుకుంటుంది. దీంతో పాటు ఓ ఆర్ట్ వర్క్ కూడా తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు అమితాబ్.
ఇటీవలె అమితాబ్ బచ్చన్‌తో పాటు ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్యరాయ్, మనవరాలు ఆరాధ్య కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. అభిషేక్, అమితాబ్ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఐశ్వర్యరామ్, ఆరాధ్య హోమ్ క్వారంటైన్‌లో ఉన్నారు.
- Advertisement -