అమితాబ్ హెల్త్ అప్‌డేట్…

165
amitabh
- Advertisement -

కరోనాతో ముంబై నానావతి హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు బిగ్ బీ అమితాబ్, అభిషేక్ బచ్చన్‌. వీరిద్దరితో పాటు ఐశ్వర్యరాయ్, ఆరాధ్యలు హోంక్వారంటైన్‌లో చికిత్స పొందుతుండగా అమితాబ్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

ఇక ఇప్పటికే కరోనా నేపథ్యంలో సేవలందిస్తున్న డాక్టర్లపై సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు గుప్పించిన అమితాబ్‌ తాజాగా తన హెల్త్‌పై మరోసారి అప్ డేట్ ఇచ్చారు.

మా ఆరోగ్యం గురించి వాక‌బు చేస్తూ మాపై కురిపిస్తున్న ప్రేమ‌, ఆశీర్వాదం, ప్రార్ధ‌న‌లు అన్నీ చూశానని…మీ అమితమైన ప్రేమ‌కి కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. హాస్పిట‌ల్‌లో రూల్స్ చాలా క‌ఠినంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా మా ఆరోగ్యం కోస‌మేనని పేర్కొన్నారు బిగ్ బీ.

- Advertisement -