కరోనా యోధులపై అమితాబ్ ప్రశంసలు..!

30
amitabh bachchan

బాలీవుడ్ నటుడు బిగ్ బి అమితాబ్ ఫ్యామిలీలో నలుగురికి కరోనా సోకిన సంగతి తెలిసిందే. అమితాబ్‌తో పాటు అభిషేక్, ఐశ్వర్యరాయ్,ఆరాధ్యకి కరోనా పాజిటివ్ రాగా అమితాబ్,అభిషేక్ నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఐష్,ఆరాధ్య హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

ప్రస్తుతం అమితాబ్ ఆరోగ్య పరిస్ధితి నిలకడగానే ఉండగా మరో వారం రోజుల్లో ఆయన ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ కానున్నారు. ఈ నేపథ్యంలో కరోనా యోధులు, డాక్టర్లపై ప్రశంసలు గుప్పించారు అమితాబ్.

స‌హ‌జ‌మైన తెల్ల దుస్తులు వేసుకున్న వారు సేవ చేసేందుకు అంకితం. దేవుడి అవ‌తారంలో ఉన్న వారు అహాన్ని చెరిపేసి మ‌న సంర‌క్ష‌ణ స్వీక‌రించారు.మాన‌వ‌త్వ‌పు జెండాను ఎగురువేస్తున్నారు అని అమితాబ్ బ‌చ్చ‌న్ త‌న ట్వీట్‌లో పేర్కొన్నారు.