సర్కార్ 3..మరో ట్రైలర్‌‌..

229
Amitabh Bachchan is angrier than ever in RGV's film ...
- Advertisement -

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో అమితాబ్ బచ్చన్ లీడ్ రోల్లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సర్కార్ 3. గతంలో రెండు భాగాలుగా రిలీజ్ అయిన సర్కార్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను  రూపొందిస్తున్నారు. వంగవీటి తరువాత వర్మ దర్శకత్వంలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా టైలర్స్‌ని రిలీజ్‌ చేసిన వర్మ తాజాగా మరో ట్రైలర్ ని రిలీజ్‌ చేశాడు.
 Amitabh Bachchan is angrier than ever in RGV's film ...
సర్కార్ సిరీస్ లో వస్తున్న సర్కార్ 3 సినిమాలోని  ట్రైలర్ ని బుధవారం ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. అయితే ఈ ట్రైలర్ ఇప్పుడు ఆడియన్స్ లో చాలా ఎగ్జైట్ మెంట్ ని క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే వర్మ ఈ చిత్రంలోని పాత్రలను పరిచయం చేశాడు. అయితే దాదాపు రెండున్నర నిమిషాల వీడియోలో ముఖ్యంగా అమితాబ్ నటన అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే రెండు పార్ట్‌లు రాగా, ఇది మూడోది.

అమితాబ్, జాకీష్రాఫ్, రోనిత్ రాయ్, గోవింద్ దేశ్‌పాండే క్యారెక్టర్‌లో మనోజ్ బాజ్‌పాయి, అను పాత్రలో హీరోయిన్ యామీ‌గౌతమ్ కనిపిస్తున్నారు. ట్రైలర్‌ని వీక్షించిన అభిమానులు నాలుగోభాగం వుంటుందన్న డౌట్‌ని వ్యక్తంచేస్తున్నారు. అంతా రెడీ అయితే మే 12న రిలీజ్ చేయాలన్నది మేకర్స్ థాట్.

- Advertisement -