గ్రేటర్ ప్రచారంలో అమిత్ షాకు నిరసన సెగ..

176
Amit Shah roadshow
- Advertisement -

కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ రోడ్ షోలో నిరసన సెగ తగిలింది. నేడు కేంద్ర హోంమంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రచారానికి హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. అమిత్ షా బేగంపేట ఎయిర్‌పోర్టు నుండి నేరుగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకొని భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయం నుంచి అమిత్ షా బయలుదేరి సికింద్రాబాద్‌ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని వారాసిగూడ చౌరస్తా నుంచి సీతాఫల్‌మండిలోని హనుమాన్‌ టెంపుల్‌వరకు నిర్వహించే రోడ్డు షోలో పాల్గొన్నారు. అయితే అమిత్ షా టూర్‌లో నిరసన సెగ తగిలింది. అమిత్‌ షా ప్రచారం చేస్తున్న సమయంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు నిరసన తెలిపారు. అలాగే వారాసిగూడలో save bsnl పేరుతో ప్లకార్డులు పట్టుకొని పలు కుటుంబాలు తమ నిరసనను తెలిపాయి.

- Advertisement -