మూడు రోజులు మద్యం షాపులు బంద్‌..

242
liquor shops
- Advertisement -

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార పోరు నేటి సాయంత్రం ముగియనుంది. ఈ నేపథ్యంలో జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు తమ పనులలో బిజీగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారానికి నేటి సాయంత్రం తెరపడనుండటంతో మద్యం విక్రయాలను నిలిపివేయనున్నారు. మూడు రోజులపాటు మద్యం షాపులు బంద్ కానున్నాయి.

నేటి సాయంత్రం ఆరు గంటల నుంచి మంగళవారం సాయంత్రం ఆరు గంటల వరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. రాజకీయ నాయకులు ఓటర్లకు మద్యం ఎరగా వేయకుండా ఉండేందుకు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు, నేటి నుంచి మద్యం దుకాణాలు మూతపడనుండడంతో నిన్నటి నుంచే నగరంలో మద్యం విక్రయాలు ఊపందుకున్నాయి.

అయితే, బల్క్‌గా మద్యం కొనుగోళ్లు చేయకుండా ఆబ్కారీ అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎవరైనా పెద్ద ఎత్తున మద్యాన్ని కొనుగోలు చేసినా, విక్రయించినా ఎన్నికల కమిషన్ చట్టం ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి మద్యం సరఫరా కాకుండా చెక్‌పోస్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.

- Advertisement -