కరోనా బాధితులకు అందుబాటులో అంబులెన్స్‌లు..

214
errabelli
- Advertisement -

క‌రోనా బాధితుల‌కు 24 గంట‌లూ అందుబాటులో ఉండే విధంగా అత్యాధునిక వ‌స‌తుల‌తో కూడిన అంబులెన్స్ వాహ‌నాన్ని సిద్ధం చేసి అందిస్తున్న‌ట్లు రాష్ట్ర పంచాయ‌తీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి స‌ర‌ఫ‌రాశాఖ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు తెలిపారు. రాష్ట్ర గిరిజ‌న సంక్షేమం, స్త్రీ, శిశు సంక్షేమ‌శాఖ మంత్రి స‌త్య‌వ‌తి రాథోడ్ తో క‌లిసి మంత్రి సంబంధిత అంబులెన్స్ వాహ‌న తాళం చెవిని తొర్రూరు వైద్యాధికారి డాక్ట‌ర్ దిలీప్ కుమ‌మార్ కి అందించారు.

ఈ సంద‌ర్భంగా మంత్రులు ఎర్ర‌బెల్లి, స‌త్య‌వ‌తిలు మాట్లాడుతూ, క‌రోనా విస్త‌ర‌ణ పెరుగుతున్నందున ప్ర‌జ‌లు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాల‌న్నారు. టిఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌లు, పుర‌పాల‌క‌, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ‌ల మంత్రి కె టి రామారావు త‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా ఇచ్చిన పిలుపులో భాగంగా గిఫ్ట్ ఎ స్మైల్ కింద వ‌రంగ‌ల్ ఉమ్మ‌డి జిల్లా నుంచి 14 వాహ‌నాల‌ను ఇచ్చిన‌ట్లు మంత్రులు తెలిపారు. అందులో పాల‌కుర్తి నియోజ‌క‌వ‌ర్గానికి రెండు వాహ‌నాల‌ను ఇస్తున్న‌ట్లు వారు ప్ర‌క‌టించారు. మాజీ రాష్ట్ర ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ప‌ర‌మ‌ప‌దించిన కార‌ణంగా, దేశ వ్యాప్తంగా వారం రోజుల‌పాటు సంతాప దినాలున్నందున ఎలాంటి కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ కూడ‌ద‌ని అన్నారు.

అయినా, మ‌రో వారం రోజుల వ‌ర‌కు ఆగితే, క‌రోనా బాధితులకు ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని, పైగా ఇది వేడుక కూడా కానందున‌, కరోనా బాధితుల‌కు స‌దుపాయంగా ఉంటుంద‌నే ల‌క్ష్యంతోనే ఈ వాహ‌నాన్ని ప్ర‌భుత్వ వైద్య‌శాల‌కు అంద‌చేస్తున్నామ‌న్నారు. వాహ‌నాన్ని స‌ద్వినియోగం చేస్తూ, ప్ర‌జ‌ల‌కు ఉప‌యోగ‌ప‌డే విధంగా చూసుకోవాల‌ని సంబంధిత వైద్యాధికారికి మంత్రులు సూచించారు. అంత‌కుముందు మంత్రులిద్ద‌రూ మాజీ రాష్ట్ర ప‌తి దివంగ‌త ప్ర‌ణ‌బ్ చిత్ర‌ప‌టానికి పూల మాల వేసి నివాళుల‌ర్పించారు. ఆయ‌న సేవ‌ల‌ను శ్లాఘించారు.

- Advertisement -