ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్…

113
rajiv kumar

భారత ఎన్నికల కమిషనర్‌గా రాజీవ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. 1960 ఫిబ్రవరి 19న జన్మించిన రాజీవ్ కూమార్, 1984 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. పలు కేంద్ర మంత్రిత్వ శాఖలతోపాటు బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శిగా రిటైర్ అయ్యారు.

అనంతరం పబ్లిక్ ఎంటర్‌ప్రై‌జెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్‌గా నియమితులైన రాజీవ్ కుమార్ ఆగస్టు 31 వరకు ఆ పోస్టులో ఉన్నారు. భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా, మరో ఎన్నికల కమిషనర్ సుశీల్ చంద్రతో కలిసి ఆయన విధులు నిర్వహించనున్నారు.