Rayudu:ఇది ప్రజల విజయం

13
- Advertisement -

ఏపీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది. టీడీపీ స్పష్టమైన ఆధిక్యంతో అధికారాన్ని కైవసం చేసుకోగా మాజీ క్రికెటర్, జనసేన నేత అంబటి రాయుడు హర్షం వ్యక్తం చేశారు.

ఇది ఏపీ ప్రజల గొప్ప విజయం. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు అభినందనలు. రాష్ట్రాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లేందుకే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జట్టు కట్టారు. ఏపీకి మంచి రోజులు రాబోతున్నాయి. ఈ అఖండ విజయంతో నారా లోకేష్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిందని ఎక్స్ ద్వారా వెల్లడించారు అంబటి రాయుడు.

Also Read:జనసేన ప్రభంజనం..

- Advertisement -