అంబటి రాయుడిపై వేటు తప్పిదమే..!

147
ambati rayudu

2019 వరల్డ్‌కప్ జట్టులోకి అంబటి రాయుడిను ఎంపిక చేయకపోవడం తప్పిదమేనని తెలిపారు భారత మాజీ సెలక్టర్ దేవాంగ్ గాంధీ. అవును అది తప్పిదమే. కాకపోతే మేమూ మనుషులమే. అప్పుడు మేము ఎంపిక చేసిన జట్టు మంచి కాంబినేషన్ అని అనుకున్నాం అన్నారు.

కానీ.. ఆ తర్వాత తెలిసింది. ఒకవేళ రాయుడు టీమ్‌లో ఉండింటే జట్టుకి ఉపయోగంగా ఉండేదని. వాస్తవానికి వన్డే ప్రపంచకప్‌లో ఆ మ్యాచ్ మినహా టీమిండియా మెరుగ్గా ఆడింది. రాయుడిపై వేటు గురించే ఎక్కువ చర్చ నడిచింది. రాయుడి బాధని నేను అర్థం చేసుకోగలను.. అతని అసహనంలోనూ న్యాయముందని తెలిపాడు గాంధీ.

అప్పటివరకు బ్యాటింగ్ ఆర్డర్ నెం.4లో రాయుడికి వరుసగా అవకాశాలిచ్చిన భారత సెలెక్టర్లు వన్డే ప్రపంచకప్‌కి మాత్రం నెం.4 స్థానం కోసం ఆల్‌రౌండర్ విజయ్ శంకర్‌ని ఎంపిక చేశారు. దీంతో చిర్రెత్తిపోయిన రాయుడు…..వరల్డ్‌కప్‌ని చూసేందుకు 3Dగ్లాస్‌‌ని ఆర్డర్ చేసినట్లు ట్వీట్ చేయడం.. అప్పట్లో పెద్ద దుమారం రేపింది.