అమెజాన్‌ బాస్‌కు మీ ఐడియా కావాలట..!

212
- Advertisement -

ప్రపంచ ధనవంతుల్లో ఒకరైన జెఫ్‌ బెజోస్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్చల్‌ చేస్తోంది. అంతేకాదు తరచూ ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉంటే అమెజాన్ సీఈవో ఈ ట్విట్‌తో దుమ్ము రేపుతున్నారు. అసలు విషయం ఏంటంటే..ఆయన తన ఆస్తిలోని కొంత భాగాన్ని దానం చేయాలనుకుంటున్నారు.

ఇందుకు జెఫ్‌ బెజోస్‌ నెటిజన్ల సాయం కోరారు. త‌న సంపాద‌న‌ను దానం చేయాల‌నుకుంటున్నాననీ దీనికి సలహాలివ్వాంటూ ఫాలోయర్స్‌ను ఆహ్వానించారు.

Amazon CEO Jeff Bezos wants your ideas on philanthropy

కోట్లాది రూపాయాల‌ను విరాళం ఇవ్వాల‌నుకుంటున్నానని ప్రకటించారు. తాను ఇవ్వ‌బోయే విరాళాన్ని ఖ‌ర్చు చేసేందుకు ఐడియాలు కావాలంటూ ఆ ట్వీట్‌లో కోరారు. ఆయ‌న ట్వీట్ చేసిన కొన్ని గంట‌ల్లోనే వేల రీట్వీట్‌లు, 10 వేల లైకులతో ట్విట్టర్‌ లో సంచలనంగా మారింది. సుమారు 15 వేల రిప్ల‌య్‌ల జోరు నడుస్తోంది.

బ్లూ ఓరిజన్‌, వాషింగ్‌టన్‌పోస్ట్‌, అమెజాన్‌ సమాజంలోకోసం భారీ విరాళాలిస్తున‍్నప్పటికీ.. తన ఆస్తుల్లో ఎక్కువ శాతం దానం చేయాల‌నుకుంటున్న జెఫ్‌ ఈ విషయాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వెల్ల‌డించారు . తన సొమ్ములో ఎక్కువ శాతం దానాలకే వినియోగిస్తానని.. కానీ ఇంకా విరాళాల రూపంలో సేవ చేయాలని కోరికగా ఉందన్నారు.

అత్యవసరమైన, శాశ్వత ప్రభావాన్ని కలిగించేలా ప్రజలకు సహాయం చేయాలని అనుకుంటున్నానని దీనికి ఐడియాలు కావాలని చెప్పారు. ఒకవేళ ఇలా ప్రకటించడం తప్పనిపిస్తే.. ఆ విషయాన్ని కూడా నిర్మొహమాటంగా తనకు తెలియజేయాలని కోరారు.

Amazon CEO Jeff Bezos wants your ideas on philanthropy

కాగా జెఫ్ బేజోస్ మొత్తం ఆస్తివిలువ సుమారు 76 బిలియ‌న్ల డాల‌ర్లుగా ఉంది. ఫ్రెడ్ హచిన్సన్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ బెజోస్ కుటుంబం ఇటీవల భారీ విరాళాన్ని అందించింది. వీరినుంచి 35 మిలియన్ డాలర్లను అందుకున్నట్లు రీసెర్చ సెంటర్‌ గత నెలలో ప్రకటించింది.

41 సంవత్సరాల తమ సేవల్లో ఇదే అతిపెద్ద సింగిల్ విరాళమని ప్రకటించడం విశేషం. ఇక జెఫ్‌ ట్వీట్‌ పెట్టిన కొద్దిసేపటికే చాలా మందినెటిజన్లు పిల్లల కోసం ఫుడ్‌ ప్రోగ్రామ్‌లు, అడవుల సంరక్షణ, నిరాశ్రయులను ఆదుకోవడం వంటి సలహాలు ఇచ్చారు.

 Amazon CEO Jeff Bezos wants your ideas on philanthropy

- Advertisement -