చంద్రుడిపై అమెజాన్ ‘బ్లూ మూన్‌’

375
blue moon
- Advertisement -

ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇకపై తన సేవలను చంద్రుడిపై అందించనుంది. వాషింగ్టన్‌లో బ్లూమూన్ లూనార్ లాండర్ వెహికిల్‌ను ఆవిష్కరించారు అమెజాన్ ప్రతినిధులు. ఇప్పటికే అమెజాన్ బ్లూ ఆరిజన్ సంస్థ స్పేస్ రీసెర్చ్ సంస్థగా ప్రయోగాలు చేపడుతుండగా తాజాగా బ్లూ మూన్‌ ప్రాజెక్టుతో మరో అడుగు ముందుకువేసింది.

బ్లూ మూన్ ప్రాజెక్టు పేరిట చంద్రమండలం మీదకు రానున్న 5 సంవత్సరాల్లో మనుషులను పంపే టూరిజం బిజినెస్ కోసం ఈ లూనార్ లాండర్ ను తయారు చేసింది. రానున్న కొద్ది సంవత్సరాల్లో చంద్రమండలంపై భారీ ప్రాజెక్టులు కూడా నిర్మిస్తామని అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈవో జెఫ్ బెజోస్‌ తెలిపారు.

మానవరహిత, పునర్వినియోగ వాహనం ద్వారా 2024లోగా చంద్రుడిపైకి మనుషులతో పాటు సాంకేతిక పరికరాలను, ఉపగ్రహాలను, యంత్రాలను పంపించాలన్నది ‘బ్లూ మూన్‌’ ప్రాజెక్టు లక్ష్యం. భవిష్యత్తులో చంద్ర మండలంపైన మనుషులు నివాసం ఉంటారని, అందుకు అనుగుణంగా భూమి, చంద్రుడిపైకి ప్రయాణాన్ని సులభతరం చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు చేపట్టారు.

ఇస్రో చంద్రయాన్ ప్రాజెక్టు పుణ్యమా అని చంద్రుని పై నీటి జాడలున్నాయని ప్రపంచానికి తెలిసివచ్చింది. ఇస్రో సమాచారంతో పాటు మూన్ మినరాలజీ మ్యాప్ అందించిన డేటా ఆధారంగా అంతరిక్ష శాస్త్రజ్ఞులు తాజాగా ఓ మ్యాప్‌ను తయారు చేశారు. చంద్రునిపై ఎక్కడెక్కడ నీళ్లు ఉన్నాయి..?ఎంత మొత్తంలో నీళ్లు దొరుకుతాయన్న వివరాలను ఆ మ్యాప్‌లో నిక్షిప్తం చేశారు. భవిష్యత్‌లో చంద్రునిపై వెళ్లానుకేవారికి, కాలనీలు కట్టాలనుకునేవారికి ఈ మ్యాప్ ఓ వరం లాంటిది. ముఖ్యంగా వ్యోమగాములకు చంద్రుడిపై నీటిని వాడుకోవడం చాలా తేలిగ్గా మారుతుంది. చంద్రుడిపై భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణలు జరిగితే త్వరలోనే మనిషి చంద్రుడిపై నివసించేందుకు మార్గం సుగమమవుతుంది.

- Advertisement -