‘అమర్ అక్బర్ ఆంటోని’ నుండి వీడియో సాంగ్‌..

235
Amar Akbar Antony Movie
- Advertisement -

మ‌హ‌రాజా ర‌వితేజ బాలీవుడ్‌ బ్యూటీ ఇలియానా జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోని’ శ్రీను వైట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్, మోహన్ నిర్మిస్తున్నారు. రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో ప్ర‌మోష‌న్స్ జోరు పెంచేశారు చిత్ర బృందం‌. ఈ నేపథ్యంలో తాజాగా క‌ల‌ల క‌థ‌లా అంటూ సాగే పాటని విడుద‌ల చేశారు. థమ‌న్ సంగీత ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సాంగ్‌ని హ‌రిణి పాడారు. చిన్న‌నాటి జ్ఞాప‌కాల‌ని గుర్తు చేసుకునే క్ర‌మంలో ఈ సాంగ్ ఉంటుంద‌ని తెలుస్తుంది.

Amar Akbar Antony Movie

‘ఖతర్నాక్, దేవుడు చేసిన మనుషులు, కిక్‌’ చిత్రాల తర్వాత రవితేజ, ఇలియానా జంటగా నటిస్తున్న ఈ సినిమా భారీ విజ‌యం సాధించ‌డం ఖాయం అంటున్నారు. సునీల్, లయ, వెన్నెల కిషోర్, రవి ప్రకాష్, తరుణ్ అరోరా, ఆదిత్య మీనన్, అభిమన్యు సింగ్, విక్రమ్ జిత్, రాజ్‌వీర్ సింగ్, శుభలేఖ సుధాకర్, శియాజీ షిండే తదితరులు ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రం న‌వంబ‌ర్ 16న థియేటర్స్‌లో సందడి చేయనుంది.

- Advertisement -