ఆ నటితో బీరు తాగించారట

25
- Advertisement -

మంచి సినిమాలో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడమే నేను చేసుకున్న అదృష్టమని నటి ఆమని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాను, రోజా, రమ్యకృష్ణ, సౌందర్య చాలా ఫ్రెండ్లిగా ఉండే వాళ్ళమని చెప్పారు. ఎప్పుడు కూడా కథ ఏమిటని, ఎంత ఇస్తారని గాని అడగలేదని తనకు ఎలాంటి పాత్రలు ఇవ్వాలి, ఎంత ఇవ్వాలనేది మేకర్స్ కు తెలుసని స్పష్టం చేశారు. మిస్టర్ పెళ్ళాం అవార్డు తెస్తుందని, శుభసంకల్పంలో నటిస్తానని ఎప్పుడూ అనుకోలేదని ఆమని అన్నారు.

అలాగే ఇదే ఇంటర్వ్యూలో ఆమని తన ఫస్ట్ మూవీ “జంబలకడి పంబ” షూటింగ్లోని ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. ఈ సినిమాలో మందుకొట్టే సీన్ ఉందని డైరెక్టర్ నాకు చెప్పలేదంటూ,బాటిల్లో ఏదైనా కూల్డ్రింక్ కలిపిస్తారేమో అనుకున్నాను, కాని నిజంగానే బీర్ ఇచ్చి ఒక సిప్ చెయ్యమన్నారని,అందుకు నరేష్ కూడా ఏమి కాదమ్మా అన్నారని చెప్పారు. అలా మొదటి సినిమాలోనే మందుతాగే సీన్ చేశానంటూ చెప్పుకొచ్చారు.

మొత్తానికి ఆమని ప్రస్తుతం షాకింగ్ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. మొన్న సినీ ఇండస్ట్రీ లో క్యాస్టింగ్ కౌచ్ గురించి కూడా మాట్లాడిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా లేటు వయసులో ఇలా ఘాటు కామెంట్లు చేస్తూ ముందుకు పోతుంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -