తాత గురించి వాస్త‌వాలు తెలుసుకున్నాః సుహాసిని

339
Nandamuri Suhasini
- Advertisement -

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర ఆధారంగా రెండు పార్టులుగా బ‌యోపిక్ తెర‌కెక్కిన విష‌యం తెలిసిందే. ఎన్టీఆర్  క‌థానాయ‌కుడు మూవీ   నేడు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. దింతో థియేట‌ర్ల వ‌ద్ద అభిమానులు సంద‌డి చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1100 థియేట‌ర్ల‌లో ఈసినిమాను ప్ర‌ద‌ర్శించారు. అయితే ఎన్టీఆర్ చిత్రాన్ని హైద‌రాబాద్ లోని ఓ థియేట‌ర్ లో వీక్షించారు నంద‌మూరి బాల‌కృష్ణ‌, క‌ళ్యాణ్ రామ్, సుహాసిని, నారా బ్ర‌హ్మాణి ప‌లువురు కుటుంబ స‌భ్య‌లు.

ntr

ఈసంద‌ర్భంగా సుహాసిని మాట్లాడుతూ.. తాత‌య్య ఎన్టీఆర్ గురించి వాస్త‌వాల‌ను ఈసినిమా ద్వారా తెలుసుకున్నాన‌ని తెలిపారు. ద‌ర్శ‌కుడు క్రిష్ ఈసినిమాను చాలా బాగా తెర‌కెక్కించార‌న్నారు. నాన్న పాత్ర‌లో క‌ళ్యాణ్ రామ్ చాలా అద్భుతంగా న‌టించార‌న్నారు. ఈచిత్ర విజ‌యానికి కార‌కులైన నంద‌మూరి అభిమానుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఎన్టీఆర్ మ‌హానాయ‌కుడు కోసం ఎదురు చూస్తున్నాన‌ని తెలిపారు.

- Advertisement -