ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ లో అస‌లు నిజాలు ఉంటాయిః ల‌క్ష్మీ పార్వ‌తి

165
Lakshmis ntr

ఎన్టీఆర్ జీవిత చ‌రిత్ర‌కు సంబంధించిన అస‌లు నిజాలు రామ్ గోపాల్ వ‌ర్మ తెరకెక్కించే లక్ష్మీస్ ఎన్టీఆర్ లో కనిపిస్తాయ‌న్నారు ఎన్టీఆర్ భార్య ల‌క్ష్మీ పార్వ‌తి. ఈరోజు ఎన్టీఆర్ క‌ధానాయ‌కుడు సినిమా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. భారీ అంచనాల మధ్య ఈ సినిమా విడుదల కావడంతో, థియేటర్ల దగ్గర సందడి వాతావరణం నెలకొంది.

ntr

తాజాగా ఈ సినిమా గురించి స్పందించారు ల‌క్ష్మీ పార్వ‌తి. ఎన్టీఆర్ జీవితం గురించి బాల‌కృష్ణ ఎన్నీ పార్టులుగా సినిమా తీసిన ఆయ‌న గురించి పూర్తిగా చెప్ప‌లేర‌న్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ పూర్తిగా ఎన్టీఆర్ ఆధీనంలో తెర‌కెక్కింద‌న్నారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ సినిమాను చూడ‌మ‌ని నన్ను ఎవ‌రూ ఆహ్వానించ‌లేద‌ని చెప్పింది. రామ్ గోపాల్ వ‌ర్మ తెరెకెక్కించే ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ అస‌లైన నిజాలు ఉంటాయ‌ని తెలిపారు.

Lakshmis Ntr

ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుద‌ల కోసం తాను కూడా ఎదురుచూస్తున్నాన‌ని చెప్పారు. ఎన్టీఆర్ బ‌యోపిక్ ను ఉన్న‌ది ఉన్న‌ట్లుగా తెర‌కెక్కించే దైర్యం ఒక్క రామ్ గోపాల్ వ‌ర్మకు మాత్ర‌మే ఉంద‌న్నారు. తాజాగా వ‌ర్మ విడుద‌ల చేసిన రెండో పాట త‌న‌కు బాధ క‌లిగించింద‌ని ఆవేద‌న వ్యక్తం చేశారు. వ‌ర్మ మూవీని ఎలా తెర‌కెక్కిస్తున్నాడో నాకు తెలియ‌ద‌ని చెప్పారు.