KTR:ప్రాంతాలు వేరైనా మనమంతా ఒక్కటే

40
- Advertisement -

ప్రాంతాలుగా వీడిపోయిన తెలుగు ప్రజలమంతా ఒకటిగానే కలిసి ఉంటామని ఉద్యమ సమయంలో చెప్పిన మాటలను గుర్తుచేసుకున్నారు మంత్ర కేటీఆర్‌. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మహాబూబ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. జిల్లా కేంద్ర సమీపంలోని దివిటిపల్లి వద్ద సుమారు 270 ఎకరాల్లో నిర్మిస్తున్న అమరరాజా లిథియం బ్యాటరీ కంపెనీకి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి గల్లా అరుణ, గల్లా జయదేవ్‌తో కలిసి భూమిపూజలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ…దేశ విదేశాల్లో పోటిపడి పైసా లంచం లేకుండా పారదర్శకంగా పరిశ్రమలను తెలంగాణకు తీసుకురావాలంటే సవాల్‌తో కూడుకుని ఉంటుందని అన్నారు. మహాబూబ్‌నగర్ జిల్లాలో లిథియం బ్యాటరీ ప్లాంట్ ప్రకటన వచ్చిన తర్వాత దేశంలోని 8రాష్ట్రాలు దీని కోసం పోటీపడ్డాయని అన్నారు. ప్రపంచ వేదికలపై అందరిని తెలంగాణకు రావాలని మేము పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణలో అద్భుతమైనన మౌలిక వసతులతో పాటు పారిశ్రామిక భూములు, నీళ్లు పుష్కలంగా ఉన్నాయని అన్నారు. నిరంతర విద్యుత్‌ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు.

ఈ రోజు అమరరాజా ఫ్యాక్టరీ పదివేల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తుందన్నారు. రాబోయే 10సంవత్సరాలలో 9500కోట్ల రూపాయలను ఇక్కడ పెట్టుబడిగా పెట్టనున్నట్టు తెలిపారు. 37 సంవత్సరాల ప్రస్థానంలో పెట్టిన మొత్తం పెట్టుబడిని రెట్టింపుగా ఒక్క మహబూబ్‌నగర్‌లోనే పెడుతున్నారని అన్నారు. ఇది కాలుష్య రహితమైన బ్యాటరీలనను ఉత్పత్తి చేస్తుందని అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన లిథియం అయాన్ బ్యాటరీలను తయారుచేయనున్నట్టు తెలిపారు.

Also Read: చరిత్ర గతిని మార్చిన నెపోలియన్ బోనా పార్టీ

జీరో లిక్విడ్ వేస్ట్ పద్ధతిలో అంతర్జాతీయ ప్రమాణలతో కూడిన ప్లాంట్ ఇక్కడ ఏర్పాటు కానున్నట్టు తెలిపారు. 16గిగావాట్ల ఆవర్ల సామర్థ్యంతో ప్లాంట్ ఏర్పాటు కాబోతున్నట్టు తెలిపారు. ఒక్క గిగావాట్‌ ఐదులక్షల టూవీటర్ల బ్యాటరీలు అందించవచ్చని అన్నారు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ మహబూబ్‌నగర్‌లో పెట్టబడి పెట్టేవిధంగా కంపెనీ యాజమాన్యం ఒప్పించారని అన్నారు. పక్కనే నూతన ఐటీ టవర్లో స్థానికులకు శిక్షణ కార్యాక్రమాలను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.

Also Read: “40 శాతం కమిషన్ “..చిక్కుల్లో బీజేపీ !

- Advertisement -