లలిత జ్యూయలర్స్ ఎండీ గుర్తున్నాడుగా.. అదేనండి ‘డబ్బులు ఊరికే రావు’ అంటూ ఈ మధ్యకాలంలో ఏ టీవీలో చూసినా.. ఏ పేపర్లో చూసినా.. ఆయనే కనిపించారు. హా ఇప్పుడు గుర్తొచ్చాడు కదా..! ! ఆయన కంపెనీ యాడ్ లో ఆయనే కనిపించి ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు కిరణ్ కుమార్ . తాజాగా ఆయనతో కలిసి హీరో అల్లు శీరీష్ సెల్ఫీ దిగాడు. ఈ ఫోటోలను ట్విట్టర్ లో పోస్టు చేశాడు. ‘సెల్ఫీలు ఎవరికీ ఊరికే రావు.. లక్ ఉండాలి’ అంటూ శిరీష్ ట్వీట్ చేశాడు.
ఆయనను ఓ విమానాశ్రమయంలో కలిసానని, ఓ సెల్ఫీ కావాలి అని అడిగి తీసుకున్నానని చెప్పాడు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. నెటిజన్లు కామెంట్లు, షేర్లు చేస్తూ వైరల్ చేస్తున్నారు. తాజాగా అల్లుశిరీష్ నటించిన యుద్దభూమి విడుదలైన విషయం తెలిసిందే. తమిళంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో డబ్ చేశారు. డబ్ సినిమా కావడంతో తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది.
https://twitter.com/AlluSirish/status/1014020712699289600