వారి సొంతగడ్డపై.. మాకు పెద్ద సవాల్..

422
Virat-Kohli
- Advertisement -

నేడు భారత్, ఇంగ్లండ్ మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మాట్లాడారు. విదేశీ పర్యటనలకు టీం ఎప్పుడూ ఆసక్తిగా ఉంటుందని చెప్పారు. కానీ వారి సొంత గడ్డపై ఇంగ్లండ్ జట్టును ఎదుర్కోవడం పెద్ద సవాల్ అని పేర్కొన్నారు. ప్రపంచ కప్ కు ముందు ఇంగ్లండ్ పర్యటన తమకు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు. టీం సమిష్టి కృషితో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

England &India

ఇప్పటి వరకు ఇంగ్లండ్ గడ్డపై విరాట్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ పర్యటనలో మాత్రం తన ప్రతిభ చూపిస్తానంటూ ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశాడు. భారత్ ఇటు బ్యాటింగ్, అటు బౌలింగ్ పరంగా బలంగా ఉంది. ఓపెనర్ రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ ఫామ్ లో ఉండడం, వీరికి తోడు కోహ్లీ, ధోని, రైనా, హార్ధిక్ పాండ్యాల బ్యాటింగ్ లైనప్ కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు.

ఇక ఇంగ్లండ్ జట్టు కూడా పటిష్టంగా ఉంది. ఆస్ట్రేలియాను చిత్తుచేసి సిరిస్ కైవసం చేసుకున్న ఇంగ్లండ్. భారత్ ను కూడా చిత్తు చేయాలనే ఆకాంక్షతో ఉంది. ఇంగ్లండ్ జట్టు బ్యాటింగ్ పరంగా బలంగా కనిపిస్తోంది. బట్లర్ సూపర్ ఫాఫ్ లో ఉన్నాడు. అతనికి తోడు జాసన్ రాయ్, బెయిర్ స్టో, అలెక్స్ హేల్స్ చెలరేగడంతో టీమిండియాకు గట్టిపోటీ ఎదురుకావచ్చు. వారి సొంత గడ్డపై ఇంగ్లండ్ జట్టును టీమిండియా చిత్తు చేస్తోందో లేదో చూడాలి ఇక.

- Advertisement -