వరుస విజయాలతో సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్న హీరో బన్నీ. సరైనోడు తర్వాత బన్నీ లెటెస్ట్ మూబీ డీజే దువ్వాడ జగన్నాథం. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ వక్కంతం వంశీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడు. ఇక ఈ సినిమా దేశభక్త నేపథ్యంలో ఉండనుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమాకు నా పేరు సూర్య – నా ఇల్లు ఇండియా అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. అల్లు అర్జున్ పుట్టిన రోజైన ఏప్రిల్ 8న ఈ సినిమాను లాంచ్ చేయడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. అయితే, ఈ సినిమా దేశ భక్తి నేపథ్యంలో ఉంటుందా లేదా అనేదానిపై అభిమానుల్లో సందేహం నెలకొంది. టైటిల్ లో ఆ అర్థం ధ్వనిస్తుంది కనుక .. దేశభక్తిని ప్రేరేపించే చిత్రమేనని అనుకోవడానికి బలం చేకూరుతోంది.
ఇక సరైనోడు తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో తెలుగు, తమిళ భాషల్లో ఓ యాక్షన్ సినిమాను బన్నీ ప్లాన్ చేశాడు. ఈ సినిమా ప్రారంభమైంది కూడా. ఈ మూవీ ఆగిపోయిందని అందుకే బన్నీ వక్కంతం వంశీతో సినిమాను ప్లాన్ చేసుకున్నాడని టీ టౌన్‌లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ రూమర్స్ పై దర్శకుడు లింగుసామి క్లారిటీ ఇచ్చాడు. బన్నీతో తాను చేస్తున్న ప్రాజెక్ట్ ఆగిపోలేదని.. ప్రస్తుతం ఉన్న కమిట్మెంట్స్ కారణం గా ఈ సినిమా కాస్త ఆలస్యంగా ప్రారంభమవుతుందని ప్రకటించాడు. ప్రస్తుతం డీజే షూటింగ్ లో బిజీగా ఉన్న బన్నీ ఆ తరువాత రచయిత వక్కంతం వంశీని దర్శకుడి పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సినిమాకు ఓకె చెప్పాడు. ఈ గ్యాప్ లో లింగుసామి కూడా విశాల్ హీరోగా పందెం కోడి 2 సినిమాను పూర్తి చేసేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. దీంతో బన్నీ తర్వాత సినిమాలపై మరింత అంచనాలు పెరిగిపోయాయి.