‘మహానటి’కి ‘సూర్య’ పార్టీ..

252
Allu Arjun's Lavish Party for Team Mahanati
- Advertisement -

అలనాటి అందాల నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మహానటి’. ఈ సినిమాకు ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. ఇక ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ పతాకంపై ప్రియాంక దత్, స్వప్న దత్, అశ్వినీ దత్ నిర్మాతలుగా వ్యవహరించారు.

Allu Arjun's Lavish Party for Team Mahanati

ఈ చిత్రంలో సావిత్రి పాత్రలో కీర్తీ సురేష్‌ నటించి తన నటనతో సావిత్రిని గుర్తుకు తెచ్చి మంచి మార్కులు కొట్టేసింది. కీర్తీ సురేష్‌తో పాటు సమంత, విజయ్ దేవరకొండ, మోహన్ బాబు, క్రిష్, అవసరాల శ్రీనివాస్, రాజేంద్ర ప్రసాద్ తదితరులు సీనియర్ నటీనటుల పాత్రలోకనిపించి వారి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఈ సినిమా విజయం కావడంతో మహానటి చిత్ర యూనిట్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ చిత్రంపై ఇటు సినీ ప్రముఖుల నుంచే కాక రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలందుతున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి ‘మహానటి’ చిత్ర దర్శకుడు, నిర్మాతలను తన ఇంటికి పిలుపించుకొని ఘనంగా సత్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ‘మహానటి’ సినిమా యూనిట్‌కు స్టైలిష్‌ స్టార్ అల్లు అర్జున్ గ్రాండ్‌గా ఓ పార్టీ ఇవ్వనున్నట్లు సమచారం. బన్నీ ఇచ్చేఈ పార్టీలో ఈ మూవీ టీంతో పాటు టాలీవుడ్‌లోని కొందరు యంగ్ డైరెక్టర్లు కూడా ఈ పార్టీలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -