అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన చివరి చిత్రం నాపేరు సూర్య నాఇల్లు ఇండియా. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా బాక్సాఫిస్ వద్ద బోల్తా పడింది. ఈమూవీపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బన్నీ అభిమానులకు నిరాశే ఎదురైంది. మంచి సక్సెస్ లో ఉన్న బన్నీ కి నాపేరు సూర్య నాఇల్లు ఇండియా ద్వారా ప్లాప్ ను సంపాదించుకున్నాడు. ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈసినిమాకు రచయిత వక్కంతం వంశీ డైరక్టర్ గా పరిచయమయ్యాడు. రైటర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వక్కంతం వంశీ డైరెక్టర్ గా మొదటిసినిమా తోనే ఫెయిల్యూర్ బాట పట్టాడు.
ఈసినిమా తర్వాత అల్లు అర్జున్ మరే సినిమాకు ఒప్పకొలేదు. దర్శకులంతా ఇతర సినిమా షూటింగ్ లలో బిజీగా ఉండటంతో బన్నీ కాలిగా ఉండిపోయాడు. ఇప్పటి నుంచి ఆయన తన సినిమాలను పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. వరుసగా డైరక్టర్లకు ఆఫర్లు ఇస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరితో సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ విక్రమ్ తో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.
ఇక ఈమూవీ తర్వాత బన్నీ మరో ఇద్దరు టాప్ డైరెక్టర్లను లైన్ ఉంచాడు. విక్రమ్ తో మూవీ అయిపోగానే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో ఒక సినిమాను చేయనున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు అభిమానులను అలరించాయి. త్రివిక్రమ్ తర్వాత సురేందర్ రెడ్డితో సినిమా చేయడానికి ప్లాన్ చేసుకున్నాడు బన్నీ . రేసుగుర్రం లాంటి బిగ్గెస్ట్ ఇచ్చిన సురేందర్ రెడ్డికి మరో అవకాశం ఇచ్చాడు . సుమారు రెండు నెలలు గ్యాప్ తీసుకున్న బన్నీ భవిష్యత్ లో ఇంత విరామం రాకుండా సినిమాలు చేయాలని..అందుకే ఆ ఇద్దరు టాప్ డైరెక్టర్లను లైన్ లో పెట్టాడు బన్నీ.