మారుతి ఆఫీస్‌లో బన్నీ సందడి..!

282
maruthi
- Advertisement -

విభిన్న కథా చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు మారుతి. చిన్న సినిమాలకు కేరాఫ్‌గా మారిన మారుతి..బ్లాక్ బస్టర్ వసూళ్లను రాబట్టడంలో దిట్టా. రీసెంట్‌గా ప్రతీరోజు పండగేతో హిట్ కొట్టిన మారుతి ప్రస్తుతం తన కొత్త సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో మారుతికి సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్‌. హైదరాబాద్‌లోని మారుతి ఆఫీస్‌ను సందర్శించి షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా మారుతి ఆఫీస్‌లో ఉల్లాసంగా గడిపిన బన్నీ, ఆఫీస్ పరిసరాలను పరిశీలించారు. బన్నీ…మారుతీ ఆఫీస్‌ను సందర్శించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

https://twitter.com/SKNonline/status/1299973314497056768
- Advertisement -