బాలయ్య దేవుడైతే మేం భక్తులం: నారా రోహిత్

258
nara rohith

తండ్రే గురువుగా నటనలో ఓనమాలు దిద్దుకుని ఇంతింతై అన్నట్టుగా ఎదిగి, తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిజానికి వన్నె తెచ్చిన అగ్రహీరో. విశేష ప్రేక్షకాదరణని, అపరిమిత అభిమానగణాన్ని సొంతం చేసుకున్న నటసింహం నందమూరి బాలకృష్ణ. సరిగ్గా 46 సంవత్సరాల క్రితం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన బాలయ్య..ఈ 4 పదుల ప్రస్ధానంలో వెండితెర అగ్రహీరోగా ఎదిగారు.

బాలయ్య ఇండస్ట్రీలోకి వచ్చి 46 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పలువురు విషెస్ తెలియచేస్తున్నారు. నువ్వు హీరో అయితే ని అభిమానిగా ఉంటాం , నువ్వు దేవుడు అయితే ని భక్తులుగా ఉంటాం , నువ్వు నాయకుడివి అయితే ని సేవకుడిలా ఉంటాం..ఏది ఏమైనా మా చివరి శ్వాస ఉన్నంత వరకు ని వెనకే ఉంటామని హీరో నారా రోహిత్ తెలిపారు.

46 సంవత్సరాలుగా తెలుగు ప్రేక్షకులని,నందమూరి అభిమానులని అలరిస్తున్న మా బాలయ్య మామకు హృదయపూర్వక శుభాకాంక్షలు. జై బాలయ్య !! జై జై బాలయ్య !! అని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు నారా రోహిత్.