దిశా పటానీ @ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్

136
disha patani

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లోఫర్ సినిమాతో వెండితెరకు పరిచయమైన బ్యూటీ దిశా పటానీ.అయితే తొలి సినిమా ఫ్లాప్ అయినా ఈ అమ్మడి అందాలకు కుర్రకారు ఫిదా అయిపోయారు. ఈ సినిమా తర్వాత బాలీవుడ్‌కు మకాం మార్చేసిన దిశా…ప్రస్తుతం బీ టౌన్‌లో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

చేతినిండా సినిమాలు ఉన్నా అందాల ఆరబోతలో ఏమాత్రం వెనుకడుగు వేయదు దిశా. ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫోటో షూట్‌లను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేస్తూ కుర్రకారుకు నిద్రపట్టకుండా చేస్తోంది ఈ అమ్మడు.

తాజాగా టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ లిస్ట్‌లో చోటు సంపాదించుకుంది దిశా. గ‌త ఏడాది 9వ ర్యాంక్ సాధించిన దిశా ప‌టానీ ఈ ఏడాది టాప్ ర్యాంకుకి చేరుకుంది. దిశా పటానీ తర్వాత స్థానాన్ని సుమన్ రావ్ దక్కించుకుంది. ఇక నెం.3 గా కత్రీనా కైఫ్, నెం.4 దీపికా పదుకునే , నెం.5 వర్తికా సింగ్, నెం.6 కైరా అద్వానీ, నెం.7 శ్రద్దా కపూర్, నెం.8 యామీ గౌతమ్, నెం.9 అదితి రావు హైదరీ , నెం.10 జాక్వెలిన్ ఫెర్నాండెజ్ లు నిలిచారు.