సినీ పరిశ్రమలో కొన్ని సినిమా కాంబోలుంటాయి. అలాంటి కాంబోలల్లో ఒకటి త్రివిక్రమ్ బన్నీ వీళ్లద్దరి కాంబోలో వచ్చిన సినిమాలు సూపర్ హిట్ మూవీస్ గా నిలిచిపోయాయి. జులాయి, సన్నాఫ్ సత్యముర్తి అలవైకుంఠపరంలో వంటి సినిమాలు చెప్పుకోవచ్చు.
తాజాగా వీళ్లద్దరి కాంబినేషన్‌లో మరోక సినిమా వస్తుందని టాలీవుడ్‌లో గుసగుసలు. అల్లు త్రివిక్రమ్ కాంబోలో నాలుగో సినిమా తెరకెక్కనున్నట్టు సమాచారం. బన్నీ కోసం ఓ కథను కూడా రెడీ చేశాడట త్రివిక్రమ్. త్వరలోనే బన్నీని కలిసి స్టోరీ నెరేట్ చేయనున్నట్లు టాక్.
బన్నీ కూడా త్రివిక్రమ్‌తో కలిసి మరోసారి సినిమా చేయాలని ఆసక్తి చూపుతున్నాడట. ప్రస్తుతం త్రివిక్రమ్, మహేష్‌తో ‘SSMB28’ చేస్తున్నాడు. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్‌కు సిద్ధమవుతుంది. ఇక బన్నీ ‘పుష్ప’ సీక్వెల్‌కు సిద్ధమౌవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. మరి ‘పుష్ప’ తర్వాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తాడా? సురేందర్ రెడ్డితో సినిమా చేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది. అయితే ఇందులో నిజమెంతుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి..
15న హను-మాన్
కేజీఎఫ్ ౩….యశ్ క్లారిటీ!
BB6..రేవంత్ చెత్త సంచాలక్!