BB6..రేవంత్‌ చెత్త సంచాలక్‌!

115
bigg boss telugu 6
- Advertisement -

బుల్లితెర రియాల్టీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 విజయవంతంగా 67 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంది. తాజాగా ఎపిసోడ్‌లో భాగంగా రోహిత్ వర్సెస్ రేవంత్‌గా మారింది. తొలుత బిగ్‌బాస్ రేవంత్ ని సీక్రెట్ రూమ్ లోకి పిలిచి నెక్స్ట్ టాస్క్ లో సంచాలక్ గా వ్యవహరించామన్నారు. ఇక అంతకముందు రోజు జరిగిన గొడవ కారణంగా రేవంత్ ఒక్కడే కూర్చొని బాధపడగా ఎవరు వచ్చిన ఎమోషనల్‌గా మాట్లాడాడు.

తర్వాత ఓ టాస్క్ లో భాగంగా శ్రీసత్య, ఫైమా, కీర్తి, ఆదిరెడ్డి, మెరీనా, రోహిత్‌ లు పోటీపడ్డారు. ఈ టాస్క్ ప్రకారం పోటీ చేసే సభ్యులకు థర్మాకోల్ బాల్స్ నింపిన గోనె సంచి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారు. వాటిని వీపుకి తగిలించుకొని అవతలి వాళ్ళ బాల్స్ పడేలా చేయాలి. ఆ బ్యాగ్ కి ఉండే రంద్రం నుంచి ఆ బాల్స్ పడేలా చేయాలి. గేమ్ అయ్యేవరకు ఎవరి దగ్గర ఎక్కువ బాల్స్ ఉంటే వాళ్ళు నెక్స్ట్ రౌండ్ కి వెళ్తారు అని చెప్పారు.

బల్స్ పడేయడానికి రోహత్, ఫైమా, ఆది రెడ్డిలు కొట్టుకున్నారు. ఈ క్రమంలో రేవంత్ – రోహిత్ మధ్య పెద్ద గొడవ జరిగింది. చివరికి రోహిత్ కి చిరాకొచ్చి తానే ఆ బాల్స్ సంచిని పడేసి కాలితో తన్ని గేమ్ నుంచి వచ్చేశాడు. రేవంత్ చెత్త సంచలక్ అంటూ సీరియస్ అయ్యాడు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -