‘కేజీఎఫ్-2’ చిత్ర యూనిట్‌పై బన్నీ ప్రశంసలు..

77
kgf 2
- Advertisement -

కన్నడ రాకింగ్‌ స్టార్ యష్‌ న‌టించిన ‘కేజీఎఫ్-2’ సినిమా భాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రంపై పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈనేపథ్యంలో తాజాగా టాలీవుడ్ ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ స్పందించారు. ఈమేరకు ‘కేజీఎఫ్‌-2 చిత్ర బృందానికి బన్ని ట్విట్టర్‌ ద్వారా అభినంద‌న‌లు తెలిపారు.

ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టిన ఐకాన్ స్టార్..”కేజీఎఫ్ చిత్రబృందానికి అభినందనలు. యష్ పర్ఫార్మెన్స్ అద్భుతం..సంజయ్ దత్, రవీనా టాండన్, శ్రీనిధి శెట్టిలది అయస్కాంతలా తమ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు. ది బెస్ట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్..రవి బస్రూర్ అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇతర టెక్నీషియన్స్ అందరినీ ఈ సందర్భంగా గౌరవిస్తున్నాను” అంటూ పేరొన్నారు. ప్రస్తుతం బన్నీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

- Advertisement -