ఐపీఎల్‌: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఢిల్లీ..

93
DC vs RR
- Advertisement -

ఐపీఎల్‌లో నేడు ఆసక్తికరమైన పోరుకు జరగనుంది. ఈ మ్యాచ్‌ కోసం ఢిల్లీ క్యాపిటల్స్- రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా జరగనున్న ఈ మ్యాచ్‌లో ఢిల్లీ జట్టు టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుంది. ఢిల్లీ జట్టులో ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది. రాజస్థాన్ జట్టులో కూడా ఎలాంటి మార్పులు లేకుండా పోరు సిద్దమైంది.

ఈ సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ పడుతూ పైకి లేస్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో మూడింటల్లో విక్టరీ కొట్టి.. మరో మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరోస్థానంలో నిలిచింది. మరోవైపు, రాజస్థాన్ రాయల్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉంది. ఆరు మ్యాచ్‌లల్లో ఓడింది రెండింట్లోనే. మొత్తం ఎనిమిదిపాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా, డేవిడ్ వార్నర్, సర్ఫరాజ్ ఖాన్, రిషభ్ పంత్ (కెప్టెన్), రోవ్‌మెన్ పావెల్, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, ఖలీల్ అహ్మద్

రాజస్థాన్ రాయల్స్: జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, సంజు శాంసన్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కరుణ్ నాయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ఓబెడ్ మెక్‌కాయ్, ప్రసిద్ధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్

- Advertisement -