స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చాలా రోజుల గ్యాప్ తర్వాత తన తర్వాతి సినిమాను ప్రకటించిన విషయం తెలిసిందే. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడు. త్వరలోనే ఈచిత్రం షూటింగ్ ప్రారంభంకానుంది. థమన్ సంగీతం అందిస్తున్న ఈచిత్రాన్ని అల్లు అరవింద్, రాథాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలు వచ్చాయి. ఇప్పడు తెరకెక్కబోయే సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. తాజాగా అల్లు అర్జున్ మరో సినిమాను అనౌన్స్ చేశాడు. తన 20వ సినిమాను సుకుమార్ తో చేయనున్నాడు తెలిపాడు.
శివరాత్రి సందర్భంగా ఈప్రాజెక్టుకు సంబంధించిన పొస్టర్ ను విడుదల చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్ధ వారు ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్య, ఆర్య2 రెండు సినిమాలు ఘన విజయం సాధించాయి. అటు సుకుమార్ అలాగే త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కు ఇది మూడవ సినిమా కావడం విశేషం. అల్లు అర్జున్ ఈరెండు సినిమాల్లో ఒకేసారి నటించనున్నాడని ప్రచారం జరగుతుంది. ఇన్ని రోజుల గ్యాప్ తర్వాత బన్నీ రెండు సినిమాల్లో నటిస్తూ చాలా బిజి కానున్నాడు. ఒకే సారి రెండు సినిమాలకు సైన్ చేయడంపై బన్నీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.