స్టన్నింగ్ లుక్ లో దువ్వాడ జగన్నాథమ్..!

225
- Advertisement -

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు దువ్వాడ జగన్నాథమ్ అలియాస్ డీజేగా రాబోతున్న విషయం తెలిసిందే. డైరెక్టర్ హరీష్ శంకర్ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమా తర్వాత బన్నీకోసం ప్రత్యేకంగా ఈ స్టోరీ రాసి దువ్వాడ జగన్నాథమ్ టైటిల్ తో సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా కోసం అల్లు అర్జున్ 8 ప్యాక్ కూడా చేశాడు. అంతేకాకుండా ఈ సినిమాలో బన్నీ పక్కా బ్రాహ్మణుడి పాత్రలో కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఇంతవరకు ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ లుక్ ఎలా ఉంటుందని అనేది బయటపడలేదు. కానీ దువ్వాడ జగన్నాథమ్ లో అల్లు అర్జున్ లుక్స్ అంటూ ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో మన స్టైలిష్ స్టార్ స్టన్నింగ్ లుక్ లో అదరగొట్టేస్తున్నాడు. అయితే ఇది ఫేక్ స్టిల్ అని తెలుస్తోంది. బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్ ఎవరో గ్రాఫిక్స్ తో తీర్చిదిద్ది.. డీజే లుక్ గా వైరల్ చేసినట్లు చెబుతున్నారు. ఇక ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా ఎంపికైంది.   దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ఈనెల నుంచే డీజే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

https://www.youtube.com/watch?v=ECxsdMRpzz0

- Advertisement -