నయా లుక్‌లో స్టైలీష్ స్టార్…

259
Allu Arjun graces the cover of a popular magazine
- Advertisement -

అత‌డి పేరే స్టైలీష్ స్టార్.. అందుకు త‌గ్గ‌ట్టే సినిమా సినిమాకు వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. సరైనోడు సినిమాలో మంచి బాడీతో ఆకట్టుకున్న డీజే సినిమాలో బ్రహ్మాణ గెటప్‌లో అలరించిన అది అల్లు అర్జున్‌కే చెల్లింది. ప్రస్తుతం నా పేరు సూర్య సినిమా చేస్తున్న అర్జున్ ఈ సినిమాలో జవాన్‌గా ఆకట్టుకునేందుకు వస్తున్నాడు.

తాజాగా సరికొత్త స్టైల్లో ఒక ఫోటో షూట్ లో పాల్గొన్ని అభిమానుల‌లో ఆనందాన్ని నింపాడు. మాగ్జిమా స్టెడ్ మ్యాగ్య జైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. నేవీ బ్లూ ట్రౌజ‌ర్, లోప‌ల వైట్ చెక్స్ ష‌ర్ట్, ఆ పై నేవీ బ్లూ బ్లేజ‌ర్ వేసుకుని దిగిన ఫోటో కేవ్వు కేక అనిపిస్తున్న‌ది. పాపిడి తీసుకునే చోట మొత్తం హేర్ ను షేవ్ చేసేసి.. అల్లు అర్జున్ డిఫరెంట్ గా కనిపించాడు.

ఈ మధ్య కాలంలో అబ్బాయిలకు కూడా బోలెడన్ని హేర్ స్టైల్స్ వచ్చేశాయి. అయితే పొడుగ్గా పెంచడం లేకపోతే, చిప్ప కటింగ్ కొట్టించుకునే రోజులు పోయి.. బోలెడన్ని వెరైటీ వెరైటీ హేర్ స్టైల్స్ తో కనిపిస్తున్నారు. ప్రత్యేకించి సెలబ్రిటీలతో అనేక రకాల హేర్ స్టైల్స్ కు ప్రాచూర్యం లభిస్తోంది. ఈ నేపథ్యంలో బన్నీ కూడా అదే ట్రెండ్‌ని ఫాలో అవ్వడం విశేషం.

Allu Arjun graces the cover of a popular magazine

- Advertisement -