కాజల్ …’ఆడి’ కహనీ

232
- Advertisement -

కాజల్ అగర్వాల్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ . బడా హీరోలందరితో సినిమాలు చేసి చాలా హిట్లను తన ఖాతాలో వేసుకుంది. అందం తో పాటు తన అభినయంతో కూడా ఆకట్టుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకుపోతోంది. పదేళ్ల క్రితం తన తొలి చిత్ర కధానాయకుడు కళ్యాణ్ రామ్‌..లక్ష్మకళ్యాణంతో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ టాలీవుడ్‌లో అందరు అగ్రహీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది.

తన అందం, అభినయంతో ప్రేక్షకులనే కాదు తన తోటి హీరోహీరోయిన్ల నుంచి మంచి మార్కులు కొట్టేసింది. తాజాగా ఓ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఫోటోషూట్‌తో అందరి అటెన్షన్‌ను తన వైపుకు తిప్పుకుంది. రొటీన్ గా రెగ్యులర్ మ్యాగజైన్ కనిపించడం ఏంటో అనుకుందో ఏమో గాని అమ్మడు కొత్త తరహాలో ఉండే టెక్ అండ్ లైఫ్ స్టైల్ కి సంబందించి మ్యాగజైన్ లో స్పెషల్ గా మెరిసింది.

ఆడి Q5 లగ్జరీ కారు ముందు వయ్యారంగా నిలబడి ఎగ్జిబిట్ మ్యాగజైన్ కోసం ఓరకంట స్టిల్ ఇచ్చింది. రెడ్ కలర్ లో ఉన్న కాజల్ కాస్ట్యూమ్ చాలా అందంగా ఉందనే చెప్పాలి. అందరి కళ్లు ఆమె డ్రెస్ డిజైనింగ్ వైపే మళ్లాయి. మొత్తానికి కాజల్ హై లెవెల్ రాయల్ లుక్ లో కరెక్ట్ గా కనిపించిందని ఆమె ఫాలోవర్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగులో ఎమ్.ఎల్.ఏ, అ! ,తమిళంలో పారిస్ పారిస్ సినిమాలో కాజల్ నటిస్తోంది. దీనికి తోడు తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్‌తో ఓ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. నాని అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తున్నది. దీంతో శ్రీనువైట్ల దర్శకత్వంలో రవితేజ హీరోగా తెరకెక్కనున్న మూవీలో కాజల్‌ని హీరోయిన్‌గా ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Kajal  Poses for Exhibit Magazine

- Advertisement -