స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల..వైకుంఠపురంలో. సంక్రాంతి కానుకగా జనవరి 12న ఈమూవీని విడుదల చేయనున్నారు. ఈ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడిన అల్లు అర్జున్ భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి అల్లు అరవింద్ గురించి చెబుతూ స్టేజిపైనే ఏడ్చేశారు. తాను తండ్రినైన తర్వాత.. తనకు తండ్రి విలువ తెలిసిందన్నారు. నాన్న గురించి నేను, నాగురించి నాన్న ఎప్పుడూ స్టేజ్‌పై చెప్పుకోలేదన్న ఆయన.. నన్ను హీరోగా లాంచ్ చేసింది నాన్నేనని.. కానీ ఇప్పటి వరకు సభాముఖంగా ఆయనకు ఎప్పుడూ థ్యాంక్స్ చెప్పుకోలేదన్నారు.
కానీ ఇప్పుడు ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నానని.. కానీ ఈ థ్యాంక్స్ కేవలం నాతో సినిమా చేసినందుకు కాదన్నారు. నాకు కొడుకు పుట్టిన తర్వాత అర్థమైంది ఒకటేనని.. నేను మా నాన్నంత గొప్పగా ఎప్పుడూ కాలేనన్నారు. కనీసం ఆయనలో సగం కూడా కాలేనని.. నాన్నలో సగం ఎత్తుకు ఎదిగితే చాలనే ఫీలింగ్ కలుగుతుందన్నారు. తన తాతకు పద్మ శ్రీ అవార్డు వచ్చిందని..అలాగే సౌత్ ఇండియాలో నెం1 ప్రొడ్యూసర్ అయిన మా నాన్నకు కూడా పద్మశ్రీ ఇవ్వాలని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలను కోరుతున్నట్లు తెలిపారు.