ప్రభాస్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్?

521
prabhastrivikram
- Advertisement -

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సాహో మూవీ తర్వాత జాన్ సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈమూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ప్రభాస్. ఈమూవీని మేలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్రయూనిట్. ఇక ప్రభాస్ తర్వాతి సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో చేయనున్నాడని ఫిలిం నగర్ వర్గాల్లో టాక్. ఇటివలే త్రివిక్రమ్ ప్రభాస్ కు కథ వినిపించాడని తెలుస్తుంది.

అయితే ఈ కాంబినేషన్ వర్కవుట్ కావాలి అంటే కొన్ని కండిషన్స్ ఉన్నట్లు సమాచారం. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల..వైకుంఠపురంలో సినిమా విజయం సాధించాలి. అలాగే ప్రభాస్ నటిస్తోన్న ‘జాన్’ సినిమా కూడా మే నెలకల్లా షూటింగ్ పూర్తి చేసుకోవాలి. ఇవి కుదిరితేనే ఈ కాంబినేషన్‌కు ఓ క్లారిటీ వస్తుంది. ప్రభాస్ తో సినిమా చేయాలని త్రివిక్రమ్ ఎప్పటి నుంచో చూస్తున్నారు..కానీ ప్రభాస్ డేట్స్ కుదరకపోవడంతో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. ఈవీరిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కే సినిమాకు దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తుంది. సంక్రాంతి తర్వాత ఈమూవీపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

- Advertisement -