- Advertisement -
కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సినిమా షూటింగ్ లకు సెలవు ఇచ్చారు. దీంతో సరదాగా కుటుంబ సభ్యులతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు సెలబ్రెటీలు. స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కు సమయం దొరికితే భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తూ కనిపిస్తాడు. కానీ ఈసారి మాత్రం తన నానమ్మతో సరదాగా గడిపాడు. అల్లు అర్జున్ తన నానమ్మ(అల్లు రామలింగయ్య భార్య )తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మనవడికి బామ్మ ఆప్యాయంగా ముద్దు పెట్టింది. ఈ ఫొటోను ఆయన భార్య స్నేహ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది. ప్రియమైన వ్యక్తులతో క్వారంటైన్ లైఫ్ గడపడం మంచి అనుభూతి అని పేర్కొంది. అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇటివలే ఈమూవీ ఫస్ట్ షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది.
- Advertisement -