అత్తగారింటిలో సందడి చేసిన బన్నీ

252
alluarjun
- Advertisement -

అల్లువారబ్బాయి స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కు యూత్‌ ప్రేక్షకుల ఫాలోయింగ్‌ ఏమేరకు ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తనదైన మ్యానరిజమ్‌, యాక్టింగ్‌తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అశేష అభిమానాన్ని సొంతం చేసుకున్న బన్నీ ఫ్యాన్స్‌ ఎక్కువగా యూత్‌ ఆడియన్సే. అభిమానులు తనపై చూపిస్తున్న ప్రేమకు తగ్గట్టుగానే అల్లుఅర్జున్‌ కూడా ఫ్యాన్స్‌తో మొదట్నుంచి మంచిగా మెదులుతూ వారిని గౌరవిస్తూ వాళ్లతో సరదాగా ముచ్చటిస్తూ వారికి మరింత దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంటాడు.

alluarjun

అయితే తాజాగా బన్నీకి తన ఫ్యాన్స్‌ అంటే ఎంత గౌరవం ఉందో మరోసారి రుజువైంది. దసరా పర్వదినం సందర్భంగా బన్నీ కుటుంబం దగ్గర పండగను జరుపుకునేందుకు ఆయన ప్రతీ సంవత్సరం తన అత్తగారింటికి వెళ్తుంటాడు. బన్నీ అత్తగారిల్లు నల్లగొండ జిల్లాలోని చింతపల్లి గ్రామమని పాఠకులకు తెలిసిన విషయమే. ప్రతీ సంవత్సరం లాగే ఈ సారి కూడా దసర పండుగ సందర్భంగా బన్నీ తన అత్తగారింటికి వెళ్లాడు.

alluarjun

అయితే బన్నీ తమ గ్రామానికి వచ్చాడన్న విషయం తెలుసుకున్న ఆయన అభిమానులతో పాటు ఆ గ్రామ యువకులు పెద్ద సంఖ్యలో బన్నీ అత్తగారింటికి చేరుకున్నారు. దీంతో అక్కడ బన్నీ అభిమానుల కోలాహాలం నెలకొంది. కొందరు యువకులు బన్నీతో సెల్ఫీలు, ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ సందర్భంగా బన్నీకి అభిమానులు దసరా శుభాకాంక్షలు తెలిపారు. అటు బన్నీ కూడా అభిమానులకు దసరా శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -