నాన్నా నాకు మంచి కారు కొనివ్వు…

239
geetha-govindam allu arjun

విజ‌య్ దేవ‌ర‌కొండ, ర‌ష్మిక మంద‌న హీరో హీరోయిన్లుగా న‌టించిన సినిమా గీత‌ గోవిందం. ఈసినిమా కు ప‌రశురామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా..ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్ స‌మ‌ర్చించ‌గా బ‌న్నీ వాసు గీతా ఆర్ట్స్ 2 బ్యాన‌ర్ పై నిర్మించారు. తాజాగా ఈ సినిమా ఆడియో ఫంక్ష‌న్ నిన్న సాయంత్రం జ‌రుపుకున్నారు. అయితే ఈఆడియో ఫంక్ష‌న్ కు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిధిగా హాజ‌ర‌య్యారు. ఈసంద‌ర్బంగా చిత్ర‌ యూనిట్ స‌భ్యులంద‌రిపై ప్ర‌శంస‌లు కురిపించాడు బ‌న్నీ.

geeth-govindam

ఈసినిమాలో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ, హీరోయిన్ ర‌ష్మీక మంద‌నలు చాలా అద్భుతంగా న‌టించార‌న్నారు. ఈ మూవీ క‌థ త‌నకు తెలుస‌ని మూవీని ద‌ర్శ‌కుడు ప‌ర‌శురామ్ చాలా అందంగా తెర‌కెక్కించార‌న్నారు. అయితే ఈ చిత్రంలో న‌టించ‌మ‌ని కొంత‌ మంది హీరోయిన్ల‌కు చెప్పానని వాళ్లకు టైం కుద‌ర‌క న‌టించలేద‌న్నారు.

నేను ఈఆడియో లాంచ్ కు విజ‌య్ కోసం రాలేద‌ని…నా మిత్రుడు బ‌న్నీ వాసు గురించి ఇక్క‌డికి వ‌చ్చాన‌ని తెలిపాడు. ఈసినిమా కోసం ప‌నిచేసిన యూనిట్ స‌భ్యులంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  ఈచిత్రం విజ‌యం సాధించి మానాన్నకు బాగా డ‌బ్బులు రావాల‌ని..ఆ డ‌బ్బుల‌తో నాకు ఓ మంచి కారు కొనివ్వాల‌ని అడిగారు అల్లు అర్జున్. ఈసినిమా ఆగ‌స్టు 15వ తేదిన ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల కానుంది.