KTR:హైదరాబాద్‌కు అలియంట్ గ్రూప్‌

69
- Advertisement -

హైదరాబాద్‌కు మరో కీలకమైన కంపెనీ రానుంది. బ్యాంకింగ్ ఫైనాన్స్ ఇన్సూరెన్స్ రంగంలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన అలియంట్ గ్రూప్‌ సంస్థ నగరంలో కొత్త సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది. ఆ కంపెనీ సీఈవో దవల్‌ జాదవ్‌ను హూస్టన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. ఈమేరకు హైదరాబాద్‌లో బీఎఫ్సీఐ రంగాన్ని బలోపేతం చేసేందుకు అలియంట్‌ గ్రూప్ ముందుకొచ్చింది. ఈ సంస్థ ద్వారా కొత్తగా 9వేల మందిని రిక్రూట్ చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు.

ట్యాక్స్‌, అకౌంటింగ్‌, ఆడిట్ స‌ర్వీస్‌, ఐటీ టెక్నాల‌జీకి చెందిన యువ‌త‌కు ఇదొక స‌దావ‌కాశం అవుతుంద‌ని మంత్రి తెలిపారు. బీఎఫ్ఎస్ఐ ప‌రిశ్ర‌మ‌కు హైద‌రాబాద్ న‌గ‌రం కేంద్ర బిందువుగా మారుతోంద‌ని, అలియంట్ సంస్థ తీసుకున్న నిర్ణ‌యం ఆ న‌గ‌రంపై ఉన్న విశ్వాసాన్ని, న‌మ్మ‌కాన్ని చూపుతుంద‌ని మంత్రి త‌న ట్వీట్‌లో వెల్ల‌డించారు.

Also Read: RBI:రూ.2వేల నోట్లు వెనక్కి…

- Advertisement -