‘నాంది’ తో విజయవంతమైన చిత్రాన్ని అందించిన హీరో అల్లరి నరేష్, డైరెక్టర్ విజయ్ కనకమేడల మరో యూనిక్, ఇంటెన్స్ మూవీ ‘ఉగ్రం’ తో వస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది గ్రాండ్‌గా నిర్మించారు. మిర్నా మీనన్ కథానాయికగా నటిచింది. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో ఉగ్రంపై అంచనాలని పెంచాయి. మే 5న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపధ్యంలో ‘ఉగ్రం’ ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. హీరోలు అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు హరీష్ శంకర్, అనిల్ రావిపూడి శివ నిర్వాణ, విఐ ఆనంద్, వశిష్ట హాజరైన ఈ వేడుక గ్రాండ్ గా జరిగింది.
హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. ఉగ్రం నా 60వ సినిమా. ఈ జర్నీలో చాలా మంది దర్శకులు, రచయితలు, నిర్మాతలు వున్నారు. ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు. నాందికి పని చేసిన టీం దాదాపుగా ఉగ్రంకి పని చేశాం. విజయ్, నేను ఈ సినిమా అనుకున్నప్పుడే నాందికి మించి వుండాలని భావించాం. ఆ అంచనాలని అందుకోవడానికి నాతో పాటు విజయ్, సిద్, అబ్బూరి రవి గారు, శ్రీచరణ్ .. అందరూ కష్టపడి పని చేశాం. మిర్నా చక్కగా నటించింది. మా నిర్మాతలు సాహు గారు హరీష్ గారు ఎక్కడా రాజీపడకుండా చేశారు. ఈ సినిమాలో పని చేసిన అందరికీ, ప్రతి కార్మికుడికి పేరుపేరునా కృతజ్ఞతలు. ఈ వేడుకు వచ్చిన అడివి శేష్, నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు శివ నిర్వాణ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, విఐ ఆనంద్ .. అందరికీ కృతజ్ఞతలు. ఉగ్రం కోసం 73 రోజులు రోజుకి దాదాపు పదహారు గంటలు పని చేశాం. ఫైట్ మాస్టర్ రామకృష్ణ మాస్టర్, ప్రుద్వి మాస్టర్ వెంకట్ మాస్టర్ .. హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్స్ లు డిజైన్ చేశారు. ఇందులో ఆరు ఫైట్లు వుంటాయి. ఇప్పటి వరకు మీకు కితకితలు పెట్టాను. కొన్నిసార్లు ఎమోషన్ చేశాను. కానీ ఇందులో ఉగ్ర రూపం చూడబోతున్నారు. ఇందులో ఇంటెన్స్ నరేష్ ని చూస్తారు. నాంది ని గొప్పగా ఆదరించారు. దానికంటే కంటే పదిరెట్లు ఈ సినిమాని ఆదరిస్తారని ఆదరించాలని కోరుకుంటున్నాను. మే 5న సినిమా విడుదలౌతుంది. ఖచ్చితంగా థియేటర్ కి వెళ్లి చూడాలి’’ అని కోరారు.
నిఖిల్ మాట్లాడుతూ.. ఉగ్రం ట్రైలర్ చూస్తునపుడు గూస్ బంప్స్ వచ్చాయి. నరేష్ అన్నకి మెసేజ్ పెట్టాను. ఉగ్రం బ్లాక్ బస్టర్ అవుతుంది. ఉగ్రంలో కొత్త నరేష్ గారిని చూస్తారు. నిర్మాతలకు అభినందనలు. విజయ్ చాలా కష్టపడ్డారు. బ్లాక్ బస్టర్ మీద బ్లాక్ బస్టర్ కొడతారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్ ‘’ అన్నారు. అడివి శేష్ మాట్లాడుతూ.. సాహు గారికి హరీష్ గారికి కృతజ్ఞతలు. విజయ్, నరేష్ గారి నాంది సినిమా నాకు చాలా ఇష్టం. ఉగ్రం తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టబోతున్నారు. యూఎస్ లో వున్నప్పుడు నరేష్ గారిని గాలి శీను పాత్రలో ప్రేమించాను. ఆయన అంటే నాకు ఒక నటుడిగా చాలా ప్రేమ, గౌరవం. కెరీర్ ఆరంభంలో ఒక చిన్న సినిమా చేస్తున్నపుడు నరేష్ గారు నా ఆడియో లాంచ్ కి వస్తే బావుంటుదని అనుకున్నాను. అలాంటింది ఆయన ప్రీరిలీజ్ ఈవెంట్ కి రావడం ఆనందంగా వుంది. యాంగ్రీ యంగ్ మ్యాన్ అని సూపర్ స్టార్ అమితాబ్ గారు వచ్చారు. ఉగ్రం తర్వాత యాంగ్రీ నరేష్ అని అందరూ పిలుస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు.
సందీప్ కిషన్ మాట్లాడుతూ.. మా అందరికీ మోస్ట్ ఫేవరేట్ సినియర్ నరేష్ అన్న. నరేష్ అన్న మాస్ నాకు చాలా ఇష్టం. ఇరవై ఏళ్ల తర్వాత నరేష్ అన్న ఒక మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. చాలా పెద్ద హిట్ అవ్వాలనేది తన హక్కు. మే 5న సినిమా పెద్ద హిట్ రావాలని కోరుకుంటున్నా. విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఉగ్రం ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయి. టీం అందరికీ ఆల్ ది బెస్ట్, షైన్ స్క్రీన్ బ్యానర్ లో నాది ఒక సినిమా వుంది. శ్రీచరణ్ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. నరేష్ గారి మాస్ శంభో శివ శంభో సినిమాలోనే చూసి విజల్స్ కొట్టా. నరేష్ అన్న సినిమా ఆడితే ఇండస్ట్రీ లో వున్న అందరూ హ్యాపీగా ఫీలౌతారు. ఆయన్ని కలవగానే బ్రదర్ ఫీలింగ్ వస్తుంది. అందరూ థియేటర్ లో ఉగ్రం చూడండి’’ అన్నారు
హరీష్ శంకర్ మాట్లాడుతూ..విజయ్ నాకు మిరపకాయ్ నుంచి డిజే వరకూ కంటిన్యూగా పని చేశాడు. ఉగ్రంకి పని చేసిన దాదాపు పది మంది గబ్బర్ సింగ్ కి పని చేశారు. నా పోస్ట్ ప్రొడక్షన్ అంతా విజయ్ సింగిల్ హ్యాండ్ తో నడిపించేవాడు. విజయ్ నాంది సినిమా విజయం సాధించినపుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. సిద్ , శ్రీ చరణ్ అద్భుతమైన వర్క్ చేశారు. ఉగ్రం టైటిల్ సాంగ్ నాకు చాలా ఇష్టం. ఈ పాట కోసం సినిమా మళ్ళీ మళ్ళీ చూడాలని అనుకుంటున్నాను. ఈ జనరేష్ లో అతి వేగంగా వంద సినిమాలు తీయబోయే నటుడు నరేష్ గారే కాబోతున్నారు. ఆయనకి ముందు అభినందనలు. నాందిలో చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యా. చాలా మంచి టీం కలసి పని చేస్తున్న సినిమా ఇది. నిర్మాతలు సాహు , హరీష్ గారికి ఆల్ ది బెస్ట్. ఉగ్రం తో ప్రేక్షకులు విజువల్ థ్రిల్ పొందబోతున్నారు. దీనికి నాది హామీ’’ అన్నారు.
అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ఉగ్రం టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ చిత్ర నిర్మాతలు సాహు, హరీష్ పెద్ది కి సహనం ఎక్కువ. ప్రోడక్ట్ కోసం ఎంతైనా ఖర్చు చేస్తారు. సహా దర్శకుడిగా ఉన్నప్పటి నుంచి నరేష్ గారు నాకు తెలుసు. నటుడిగా ఎప్పుడూ సర్ప్రైజ్ చేస్తూనే వుంటారు. ఆయన మరిన్ని డిఫరెంట్ సినిమాలు చేయాలి, ఆయనలో అల్లరి కూడా అప్పుడప్పుడు బయటికి రావాలి’ అని కోరారు.
Also Read:Tuna Fish:ఆరోగ్య ప్రయోజనాలు
చిత్ర దర్శకుడు విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. బ్రహ్మ కడలి గారు అద్భుతమైన ఆర్ట్ వర్క్ చేశారు. సిద్ బ్రిలియంట్ విజువల్స్ ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల నెక్స్ట్ లెవల్ ఆర్ఆర్ చేశారు. తూమ్ వెంకట్ నేను ఎప్పటి నుంచో స్నేహితులం. తనతో మరిన్ని మంచి కథలు చేయాలని వుంది. అబ్బూరి రవి గారికి కృతజ్ఞతలు. ఎడిటర్ చోటా కే ప్రసాద్ నాకు ఒత్తిడి లేకుండా చూసుకున్నారు. భాస్కర భట్ల, చైతన్య ప్రసాద్ చాలా చక్కన్ని సాహిత్యం అదించారు. యాక్షన్ మాస్టర్ రామ్ కృష్ణ గొప్ప యాక్షన్ సీక్వెన్స్ లు అందించారు. నా డైరెక్షన్ టీం కి, ఈ చిత్రంలో పని చేసిన అందరికీ కృతజ్ఞతలు. మా నిర్మాతలు సాహు, హరీష్ గారు ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నరేష్ గారు నాందితో నన్ను నమ్మేశారు. ఉగ్రంలో యాక్షన్ సీక్వెన్స్ లో ఎక్కడా రాజీపడకుండా చేశారు. రాత్రి పగలు హార్డ్ వర్క్ చేశారు. అలాగే మిర్నా చాలా చక్కగా చేసింది. ఇందులో పాప గా చేసిన ఊహ నటన కూడా మీ అందరికీ నచ్చుతుంది’’ అన్నారు.
నిర్మాత హరీష్ పెద్ది మాట్లాడుతూ..మా కోరిక మేరకు ఈ వేడుకకు వచ్చిన హీరోలు అడివి శేష్ నిఖిల్, సందీప్ కిషన్, విశ్వక్ సేన్, దర్శకులు శివ నిర్వాణ, అనిల్ రావిపూడి, హరీష్ శంకర్, విఐ ఆనంద్ .. అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు. దర్శకుడు విజయ్ డిక్షనరీలో రాజీ అనే పదమే లేదు. కావాల్సింది సాధించేవరకూ నిద్రపోడు. మేము ఆయన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టాడు. మే 5న సినిమా పెద్ద విజయం సాధిస్తుంది. అందరూ థియేటర్ లో చూడాలి” అని కోరారు.
Also Read:పాక ఇడ్లీ తిన్న వెంకయ్య..అద్భుతం అంటూ కితాబు
నిర్మాత సాహు మాట్లాడుతూ.. ఇక్కడికి విచ్చేసిన అతిధులందరికీ కృతజ్ఞతలు. ఉగ్రంలో నరేష్ గారు ఇప్పటి వరకూ చేయని పాత్ర చేశారు. మేము ఎంత థ్రిల్ అయ్యామో ఆడియన్స్ గా మీరూ అంత థ్రిల్ అవుతారు. నరేష్ గారి కెరీర్ లో ఇది బిగ్గెస్ట్ మూవీ అవుతుంది. మే 5న ఉగ్రం చూసి పెద్ద హిట్ చేయాలి” అని కోరారు.
మిర్నా మీనన్ మాట్లాడుతూ.. ఉగ్రం ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్. ఇంపాక్ట్ ఫుల్ సోషల్ మెసేజ్ వుంటుంది. నాందిని ఇష్టపడిన వారంతా ఉగ్రం ని ఇష్టపడతారు. విజయ గారికి కృతజ్ఞతలు, చాలా మంచి పాత్ర ఇచ్చారు. ఇంత మంచి సినిమాలో భాగం చేసిన నిర్మాతలకు కృతజ్ఞతలు. నరేష్ గారితో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమా నరేష్ గారి కెరీర్ లో మైల్ స్టోన్ చిత్రంగా నిలుస్తుంది. మే 5న అందరూ ఉగ్రం థియేటర్స్ లో చూడాల” అని కోరారు.
వశిష్ట మాట్లాడుతూ.. మూడు అక్షరాలతో వచ్చిన నరేష్ గారి అల్లరి గమ్యం నాంది చిత్రాలు ఘన విజయాలు సాధించాయి. ఇప్పుడు ఉగ్రం కూడా పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు . రాజేష్ దండా మాట్లాడుతూ.. ఉగ్రం కథ అందరి కంటే నేనే ముందు విన్నాను. ఈ సినిమా నాందికీ మించి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. షైన్ స్క్రీన్ నిర్మాతలకు, టీం అందరికీ ఆల్ ది బెస్ట్” తెలిపారు.
శివ నిర్వాణ మాట్లాడుతూ.. నాకు గమ్యం సినిమా చాలా ఇష్టం. ఆయన కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చి చేసిన నాంది సినిమా అందరం చూశాం. ఉగ్రం కూడా పెద్ద విజయాన్ని సాధిస్తుంది. ఈ సినిమా అందరం చూసి బ్లాక్ బస్టర్ చేస్తే ఆయన మరిన్ని కొత్త తరహా కథలు ఎంచుకొని విజయ్ లాంటి ఎంతో మంది ప్రతిభ వున్న దర్శకులు బయటికి వస్తారు. టీం అందరికీ ఆల్ ది బెస్ట్” అన్నారు.
విఐ ఆనంద్ మాట్లాడుతూ.. నాంది చాలా స్పెషల్ మూవీ. ఇప్పుడు వారి కలయికలో వస్తున్న ఉగ్రం కూడా ప్రత్యేకమైన చిత్రంగా ఘనవిజయం సాధిస్తుంది. టీం అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్ ” అన్నారు. శ్రీచరణ్ పాకాల మాట్లాడుతూ.. నేను చేస్తున్న ఫస్ట్ కమర్షియల్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ఉగ్రం. దర్శకుడు విజయ్ , నిర్మాతలకు కృతజ్ఞతలు. ఒక ఫెరోషియస్ పోలీస్ ఆఫీసర్ మిస్ అయిన వారిని కాపాడటం ఉగ్రం. నరేష్ గారి యాక్షన్ కొత్తగా వుంటుంది. ఇందులో మూడు పాటలు వున్నాయి. ఉగ్రం టైటిల్ సాంగ్ ముఫ్ఫై మందితో పాడించాం. కొత్త సౌండ్ ని ఇందులో వింటారు. నా మ్యూజిక్ టీం అందరికీ కృతజ్ఞతలు.
అబ్బూరి రవి మాట్లాడుతూ.. ఈ కథ విన్న తర్వాత మిస్సింగ్ , కిడ్నాప్ కేసులని చూసే కోణం మారింది. పెద్దవాళ్ళు పిల్లల పై ఎప్పుడూ ఒక కన్ను వేసి ఉంచాలి. అలాగే కొత్తవాళ్ళని చూసినప్పుడు కూడా వారిని గమనించాలి. చాలా గంభీరమైన సబ్జెక్ట్ ని పట్టుకుని సినిమా చేయడం అంత తేలిక కాదు. విజయ్, వెంకట్ తో పాటు ఇంత మంచి కథని ఎక్కడా రాజీపడకుండా నిర్మించిన నిర్మాతలని మెచ్చుకోవాలి. నరేష్ గారు బలంగా తనని తాను నమ్మారు. నరేష్ గారు నమ్మరు కాబట్టే నాంది, గమ్యం.. ఇప్పుడు ఉగ్రం వచ్చింది. థియేటర్ లో అందరూ ఉగ్రం చూడాలి” అన్నారు.
తూమ్ వెంకట్ మాట్లాడుతూ.. ఉగ్రం సినిమా మిస్సింగ్, కిడ్నాపుల గురించి. ఇది పెద్ద సమస్య. ఈ సినిమా తర్వాత సమాజంలో కొంతైనా మార్పు వచ్చి మిస్సింగ్స్ కంట్రోల్ చేయగలమన్న నమ్మకం వుంది. ఈ మార్పు వస్తే మా ప్రయత్నం ఫలిస్తుంది. ప్రతి ఒక్కరు మీ కుటుంబానికి ఒక పోలీస్ గా ఉండి కుటుంబాన్ని కాపాడుకోండి” అన్నారు. భాస్కర భట్ల, చైతన్య ప్రసాద్, బ్రహ్మ కడలి, చోటాకే ప్రసాద్, సుభాస్, రమేష్ రెడ్డి, నాగ మహేష్ తదితరులు ఈ వేడుకలో పాల్గొన్నారు.