రష్మిక అందం వెనుక సూత్రాలివే

65
- Advertisement -

హీరోయిన్ అంటేనే అందాల రాశి. ముఖ్యంగా తెలుగు చిత్ర సీమలో అందానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తారు ఫిల్మ్ మేకర్స్. అందుకే.. హీరోయిన్లు పొద్దున్న లేచిన్నుంచి అందాన్ని కాపాడుకోవడం పైనే తమ దృష్టి పెడుతుంటారు. ఈ విషయంలో రష్మిక మందాన్న ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. ముఖ్యంగా తన అందానికి సహజంగా మెరుగులు దిద్దటానికి రష్మిక మందాన్న ఇష్టపడుతుంది. నిజానికి చాలామంది హీరోయిన్లు అందం కోసం రసాయనాల్ని ఎక్కువుగా వాడతారు. కానీ, రష్మిక మందాన్న తన ముఖంలో మెరుపు కోసం పొద్దున్నే పాల మీగడలో పసుపు కలిపి, ఆ పేస్ట్ ను ముఖానికి పట్టిస్తుంది.

ఇలా చేయడం వల్ల ముఖం రోజంతా మెరుస్తూ ఉంటుందని, ఇది పూర్తిగా సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్ అని
రష్మిక మందాన్న చెబుతోంది. ఈ ఫేస్ ప్యాక్ ను రెగ్యులర్ గా వాడుతూనే, రోజూ తినే భోజనంలో కార్బొహైడ్రేట్లు, నెయ్యి ఉండేలా చూసుకుంటాను అని.. ఇవే తన అందం వెనుక ఉన్న సీక్రెట్స్ అని రష్మిక మందాన్న చెప్పుకొచ్చింది.

Also Read:బహుముఖ ప్రజ్ఞాశాలి.. సత్యజిత్‌ రాయ్‌

ఇక బయటకు వెళ్లేముందు చేతులకు, భుజానికి, మెడకు సన్ స్క్రీన్ లోషన్ తప్పనిసరిగా రాసుకోవాలంటోంది రష్మిక. ఇలా చేయడం వల్ల చర్మం కమిలిపోకుండా ఉంటుందట. ఏది ఏమైనా అందం గురించి అందాల ముద్దుగుమ్మ రష్మిక మందాన్నకి తెలిసినంతగా మరెవరికీ తెలుసు.

అన్నట్టు.. షూటింగ్స్ లేని సమయాల్లో రష్మిక మందాన్న పూర్తిగా మేకప్ కు దూరంగా ఉంటుందట అలా చేయడం వల్ల ముఖంలోని సహజమైన కాంతి మరింత మెరుగవుతుందట. నిజమే..సహజమైన అందాన్ని కాపాడుకోవడానికి మేకప్ కు దూరంగా ఉండడమే సరైన మార్గం. మొత్తానికి అందం, అభినయం కలిస్తే రష్మిక మందాన్న అని పేరు తెచ్చుకుంది ఈ బ్యూటీ. అన్నట్టు రష్మిక మందాన్న ఫాలో అయ్యే సూత్రాలనే శ్రద్దా కపూర్, పూజా హెగ్డే, సీనియర్ బ్యూటీ త్రిష కూడా ఫాలో అవుతారట.

Also Read:Tuna Fish:ఆరోగ్య ప్రయోజనాలు

- Advertisement -