రాఖీ పౌర్ణమి ప్రత్యేకత..

209
- Advertisement -

నేడు రాఖీ పౌర్ణమి. ఈరోజును శ్రావణ పూర్ణిమ, జంధ్యాల పూర్ణిమ ఇలా ఎన్నో రకాలుగా దేశమంతా ప్రజలు ఆనందోత్సాహాలతో ఈ పండుగను జరుపుకుంటారు. ఈ సారి శ్రావణ పౌర్ణమి తిథి ఆగస్టు 22న వచ్చింది. కావును ఈ రోజు రాఖీ పండుగను జరుపుకుంటారు. ఆనందోత్సహాల నడుమ రాఖీ వేడుకలను ప్రజలంతా జరుపుకుంటున్నారు. తమ సోదరులు ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ రాఖీ కడతారు. హిందూ పండగల్లో రాఖీ పౌర్ణమి ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. ఈ పండగ రోజున మహిళలు తమ అన్నాదమ్ముల చేతులకు రాఖీలను కడతారు. ఈ ఏడాది ఆగస్టు 22న రాఖీ వచ్చింది. ఈ రోజు ఉదయం 6.19 గంటల నుంచి సాయంత్రం 5.31 గంటల వరకు రాఖీ కడితే మంచిదని పంచాంగ నిపుణులు చెబుతున్నారు. అక్కాచెల్లెళ్లకు అన్నాదమ్ములకు మధ్య అనుబంధానికి ప్రతీకగా ఈ పండగా నిలుస్తోంది. తమ సోదరులు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మహిళలు వారికి రాఖీలు కడతారు. రాఖీ కట్టినందుకు ప్రతిఫలంగా అక్కాచెల్లెళ్లకు సోదరులు బహుమతులు ఇచ్చి గౌరవిస్తారు.

రాఖీ పౌర్ణమి మహాభారత కాలంలోనే మొదలైందని చెబుతుంటారు. యుద్ధం సమయంలో శ్రీ కృష్ణుడి చేతికి గాయం అవడంతో ద్రౌపతి తన చీర కొంగుతో కట్టు కట్టింది. దానినే శ్రీ కృష్ణుడు రక్ష సూత్రగా భావించాడు. రాఖీ పౌర్ణమి ఇలా ప్రారంభమైందని పెద్దలు చెబుతారు. చిత్తోర్‌గఢ్ రాజపుత్ర రాణి కర్ణావతి… ఢిల్లీ చక్రవర్తి హుమాయూన్‌కి రాఖీ పంపింది. తమ రాజ్యంపై దండయాత్రకు వస్తున్న గుజరాత్ బహదూర్ షా నుంచి కాపాడాలని కోరింది. అప్పటి నుంచే రాఖీ పండుగ మొదలైందని కూడా చెబుతారు. రాణి కర్ణావతి హుమాయూన్‌కు రాఖీ పంపిన రోజు శ్రావణ పూర్ణిమ కావడంతో మేవార్‌లో రక్షాబంధన్ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత రాజస్థాన్ అంతటా అవి ఏటా జరుగుతూ వచ్చాయి. క్రమంగా దేశమంతా ఈ సంస్కృతి వెల్లివిరిసింది. ఇప్పుడు ప్రపంచంలో భారతీయులంతా దీన్ని జరుపుకుంటున్నారు.

రాఖీపౌర్ణమి రోజు మహిళలు వారి సోదరుల ఇంటికి వెళ్తారు. తర్వాత సోదరులకు బొట్టు పెట్టి రాఖీ కడతారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు తినిపించుకుంటారు. ఇది రక్షాబంధన్ ఆచారం.. కొందరు ఈ రాఖీ పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు కూడా జరుపుకుంటారు.

- Advertisement -