రేపటి నుండే మహా హరిత పండుగ…

311
kcr
- Advertisement -

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. రేపు(బుధవారం) సీఎం కేసీఆర్‌ గజ్వేల్ నియోజకవర్గంలో మహా హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. ప్రతి ఇంటా చెట్టు.. అదే మన ప్రగతికి మెట్టు.. అనే నినాదంతో ఊరూవాడా మొక్కలు నాటేందుకు ఉరకలేస్తోంది.

ఆగస్టు 1న గజ్వేల్‌ పట్టణంలోని అన్ని మసీదుల్లో సైరన్ మోగిన వెంటనే మొక్కలు నాటేలా ఏర్పాట్లు చేశారు. మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణకు చర్యలు తీసుకునేలా చర్యలు చేపట్టారు. పిచ్చిమొక్కలను తీసేసి వాటి స్ధానంలో పండ్ల చెట్లు, పూల చెట్లు ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఎండిపోయిన మొక్కల స్థానంలో తిరిగి అదే మొక్కను నాటేందుకు చర్యలు తీసుకున్నారు. 200ల మొక్కలకు ఒక అధికారిని నియమిస్తూ గజ్వేల్ హరితహారం విజయవంతం కోసం రూ. 3కోట్లు ప్రభుత్వం కేటాయించారు.

ప్రజ్ఞాపూర్‌తోపాటు రాజిరెడ్డిపల్లి, క్యాసారం, సంగుపల్లి, ముట్రాజ్‌పల్లి, సంగాపూర్, గుండన్నపల్లి గ్రామాలు గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలోకి వస్తాయి. ఈ ప్రాంతాన్ని ఎనిమిది క్లస్టర్లుగా విభజించి అందరి సహకారంతో మొక్కలు నాటేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. దీనికి తోడు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో ప్రతీ ఒక్కరు ముగ్గురితో మొక్కలు నాటించేలా ప్లాన్ సిద్ధం చేశారు.

- Advertisement -