ఉత్కంఠ పోరులో హైద‌రాబాద్ ఘ‌న విజయం..

208
sunrisers hyderabad
- Advertisement -

ఐపిఎల్ 11వ సీజ‌న్ లో సెమీ ఫైన‌ల్ లో కోల్ కత్తాపై విజ‌యం సాధించింది హైద‌ర‌బాద్ జట్టు. ఫైన‌ల్ లో బెర్త్ క‌న్ఫామ్ చేసుకుని చైన్నైతో త‌ల‌పడ‌నుంది. కోల్ క‌త్తాతో జ‌రిగిన మ్యాచ్ లో స‌న్ రైజ‌ర్ బౌల‌ర్లు అద్భుతాన్ని సృష్టించారు. మొద‌ట టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ క‌త్తా. దీంతో మొద‌ట బ్యాటింగ్ కు దిగిన హైద‌రాబాద్ బ్యాట్స్ మెన్లు త‌డ‌బడుతూ ఆడారు. 130 ప‌రుగులు కొడితే ఎక్కువ అనుకున్నారు అంద‌రూ..కానీ చివ‌ర్లో వ‌చ్చిన ఆల్ రౌండ‌ర్ రషిద్ ఖాన్ త‌న బ్యాటింగ్ తో కోల్ క‌త్తా ప్లేయ‌ర్లకు చుక్కలు చూపించాడు. 130 ఉన్న స్కోర్ ను 174 వ‌ర‌కూ తీసుకొచ్చాడు.

rashid khan

అటు బౌలింగ్ లోనూ ఇటూ బ్యాటింగ్ త‌న‌దైన ప్ర‌తిభ క‌న‌బ‌ర్చాడు ర‌షిద్ ఖాన్. కేవ‌లం 10బంతుల్లో 34 ప‌రుగులు చేసి హైద‌రాబాద్ ను ఫైన‌ల్ కు తీసుకువ‌చ్చాడు. అంతేకాకుండా బౌలింగ్ లో కూడా కీల‌క పాత్ర పోషించాడు. మూడు వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గెలుచుకున్నాడు. హైద‌రాబాద్ బౌల‌ర్ల ఒత్తిడి కోల్ క‌త్తా బ్యాట్స్ మెన్లు త‌ట్టుకోలేక‌పోయారు. తొలి ఓవర్ నుంచే దూకుడు మొదలుపెట్టి విజయం దిశగా పయనిస్తున్నట్టు అనిపించిన కోల్‌కతా నైట్ రైడర్స్ చివర్లో ఒత్తిడి తట్టుకోలేక వికెట్లను పారేసుకుంది. మొద‌ట్లో బానే ఆడినా చివ‌ర్లో అంద‌రూ వెనుదిరిగారు.

dinesh karhik and willamsonsకీలక మ్యాచ్‌లో బోల్తాపడి ఫైనల్ అవకాశాలను చేజేతులా పోగొట్టుకుంది కోల్ క‌త్తా. స‌న్ రైజ‌ర్ ఓపెన‌ర్స్ శిఖ‌ర్ ధావ‌న్, వృద్దిమాన్ సాహాలు మంచి శుభారంభాన్నిచ్చారు. హైద‌రాబాద్ నిర్ణిత ఓవ‌ర్లలో 174 ప‌రుగులు చేసి భారీ విజ‌యాన్ని చేప‌ట్టింది. దీంతో భారీ ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన కోల్ క‌త్తా బ్యాట్స్ మెన్లు 160 ప‌రుగులే చేసింది. 14 ప‌రుగుల తేడాతో కోల్ క‌త్తా ప‌రాజ‌యం పాలైంది. మొత్తం మీద హైద‌రాబాద్ టీం గెల‌వ‌డంలో కీల‌క పాత్ర పోషించాడు ర‌షిద్ ఖాన్. ఇక ఫైనల్ మ్యాచ్ లో చైన్నై తో త‌ల‌ప‌డ‌నుంది హైద‌రాబాద్.

- Advertisement -